శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ బయల్దేరిన సర్వేశ్వరుడు

Date:15/01/2021

శ్రీకాళహస్తి  ముచ్చట్లు:

జగద్రక్షకుడైన శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబ సమేతం గా కైలాస గిరి ప్రదర్శనకు తరలివెళ్లారు. స్వామి అమ్మవార్లను దర్శించి భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణానికి రావాలని కోరేందుకు స్వయంగా స్వామివారి గిరిప్రదక్షిణ చేయడం విశిష్టమైనది. కనుమ పండుగ రోజు శ్రీకాళహస్తి శివుడు స్వయంగా కైలాసగిరి కొండ లోకి వెళ్లి కొండల్లో కొలువుతీరిన  మహర్షులు, మునులు ఋషులు ను స్వయంగా తమ వివాహం మహోత్సవానికి రావాలని ఆహ్వానిస్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్ఛారణలతో ఊరేగింపు గిరిప్రదక్షిణ ప్రారంభించారు. 14 కిలోమీటర్లు స్వామి అమ్మవార్లు వారి వెంట వందలాదిగా భక్తులు కాలి నడకన బయలు దేరి వెళ్లారు. కరోనా కారణంగా  స్వామి అమ్మవార్ల ను సకల జనాలు గత పది నెలలుగా దర్శించుకో లేకపోయారు. మొట్టమొదటిసారిగా స్వామి అమ్మవార్లు గ్రామోత్సవానికి రావడంతో దారిపొడుగునా అధిక సంఖ్యలో భక్తులు అపూర్వ స్వాగతం పలికి కర్పూర హారతులు ఇస్తూ శంభో శంకర అంటూ స్వామి వారి నామస్మరణ చేస్తూ భక్తి తత్వం ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి

Tags: Srikalahasti is the Sarveshwar who set out for the hills

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *