మృతుల కుటుంబానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేయూత
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చనిపోయిన నిరుపేదలు అమ్మపాల్యం హరిజనవాడకు చెందిన చెంగమ్మ, రామచంద్రపురంకు చెందిన అమ్ములు అలాగె బీపీ అగ్రహారంకు చెందిన సుబ్రమణ్యం అనారోగ్యంతో మరణించారు.వారి ఆకస్మికమృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులని పరామర్శించి ఆర్థిక సహాయం క్రింద ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ముగ్గురికి 30,000 వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.అలాగే శ్రీకాళహస్తి పట్టణం,ప్రాజెక్ట్ వీది మరియు కొండమిట్టలో శివైక్యం చెందిన వారికి పూలమాలు వేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Tags: Srikalahasti MLA’s condolences to the bereaved family
