Natyam ad

కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం

తిరుమల ముచ్చట్లు:

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  శుక్రవారం ఉదయం కాళీయమర్దనాలంకాములో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు.వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటల నుండి స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.  సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనం పై  స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ న‌టేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్  ధనుంజయులు భక్తులు పాల్గొన్నారు.

 

Post Midle

ఏప్రిల్ 8న చక్రస్నానం

 

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  శనివారం  ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ.ఏప్రిల్ 9న పుష్పయాగంశ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం  6 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

 

Tags:Srikodandaramaswamy Kataksha in Kaliyamardanalankaram

Post Midle