Natyam ad

పట్టణం లో గీతామందిరం నందు,వైభవోపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఎమ్మిగనూరు ముచ్చట్లు:


ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక గీతాజ్ఞాన సేవాసమితి కార్యవర్గ
కమిటీ కార్యవర్గ సభ్యులు ఎస్.చెన్నారెడ్డి, అధ్యక్షులు లక్ష్మన్న,కార్యదర్శి ఉరుకుందప్ప, నాగేశప్ప,నాగరాజు ల ఆధ్వర్యంలో భక్తులు పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని వేద పండితులతో వేకువ జామున గోపూజ,స్వామి వారికి అభిషేకం,దంపతులతో హోమం ఘనంగా నిర్వహించారు.
అనంతరం చిన్ని కృష్ణుని వేషధారణలతో ఉన్న చిన్నారులతో ఉట్టిని కొట్టు కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. తదుపరి రథం పై శ్రీకృష్ణ పరమాత్మ స్వామి వారి ఉత్సవమూర్తును కూర్చోబెట్టి పట్టణంలో పురవీధుల్లో కోలాటాలు ఆడుతూ ,భాజా, భజంత్రీలతో వైభవోపేతంగా రథోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు,కార్యదర్శి ఉరుకుందప్పలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం నందు పట్టణంలో గీతామందిరం నందు భక్తులతో కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని
తెలిపారు. అలాగే విశ్వశాంతి కొరకు 7వ తేదీ నుండి 24వ తేదీ వరకు యజ్ఞం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యజ్ఞం వలన వర్షం వస్తుందని,వర్షం వల్ల ఆహారం సంభవిస్తుందని,అందువల్ల ప్రజలందరూ సుఖసంతోషాలతో విరాజిల్లుతా రని అన్నారు.ఈకార్యక్రమంలో అశేష భక్త్తులు పాల్గొన్నారు.

 

Tags:Srikrishna Janmashtami celebrations in the town at Gitamandiram

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.