తిరుపతి ముచ్చట్లు:
భక్తులు, స్థానిక ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీస్ వారికి సహకరించగలరని విజ్ఞప్తి. తిరుపతి నగర పోలీసులు ఈ సంవత్సరం 2024, ఆగష్టు నెలలో తేది 25-08-2024 నుండి 27-08-2024 వరకు తిరుపతిలోని హరే రామ హరే కృష్ణ రోడ్‌లోని ఇస్కాన్ గుడిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సదరు గుడి నందు ఉత్సవాలు జరుపుటకు సదరు ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. స్థానిక భక్తులు మరియు పలువురు విఐపిలే కాకుండా వివిధ రాష్ట్రాలు మరియు విదేశీ యాత్రికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఆలయం అలిపిరి లింక్ బస్ స్టాండ్ కు ఆగ్నేయ వైపున కలదు. మరియు ఉత్తరం తూర్పు వైపున తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల నివాస గృహములు కూడా కలవు. సాంస్కృతిక కార్యక్రమాలు మరియు “ఉట్లోత్సవం” ఆలయం ముందు గల బహిరంగ మైదానంలో జరుపుకుంటారు, సదరు సాంస్కృతిక కార్యక్రమాల వీక్షించుటకు స్థానికులు మరియు బయట ప్రాంతాలనుండి భారీగా భక్తులు తరలివస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తుల ముసుగులో జేబు దొంగలు, స్నాచింగ్‌లకు మరియు మొబైల్ ఫోన్స్ దొంగలించుటకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఆలయం, పట్టణం నడిబోడ్డులో ఉన్నందున ఉత్సవాలకు భంగం సృష్టించడానికి సంఘ వ్యతిరేక అంశాలు ఈ కార్యక్రమాల స్థలాన్ని మరియు ఆలయ ఆవరణంను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు, ఆలయ ప్రాంగణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు, భక్తులను నియంత్రించేందుకు, నేరాలను అరికట్టేందుకు, ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల, ఆలయానికి వెళ్లే ముఖ్యమైన జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం బందోబస్తును ఏర్పాటు చేయడము జరుగుతున్నది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సాఫీగా మరియు సురక్షితంగా ఉండేలా, తిరుపతి నగరంలో ఈ క్రింది ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి:
ట్రాఫిక్ మళ్లించిన మార్గాలు & పార్కింగ్ ఏర్పాట్లు:
* ఇస్కాన్ ఆలయము ముందు భాగమున గల రోడ్డును రుయా ఆసుపత్రి జంక్షన్ నుండి వచ్చు ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనాలను నియత్రించేందుకు బారికేడింగ్ ఏర్పాటు చేయడము జరుగుతుంది.
* ఉత్సవములకు వచ్చు భక్తుల యొక్క వాహనములు అలిపిరి లింక్ బస్టాండ్ పార్కింగ్ స్థలములో ఉంచి కాలినడకన గుడికి వచ్చులాగా ఏర్పాటు చేయబడుతుంది.
* గుడికి కుడి వైపుగా వున్న అన్నారావు సర్కిల్ రోడ్డులో వచ్చు వాహనములు బారికేడింగ్ ద్వారా నియత్రించడం జరుగుతుంది.
* అన్నారావు సర్కిల్ నుండి వచ్చు ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనములకు, అక్కడ పార్కింగ్ సదుపాయం లేనందున, వారు బాలాజీ లింక్ బస్టాండ్ దగ్గర ఉన్న ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలం లో ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనముల పార్కింగ్ స్థలం లో నాలుగు చక్రాల వాహనములు పార్కింగ్ చేసి, అక్కడ నుండి కాలినడకన గుడికి వచ్చులాగా ఏర్పాటు చేయడమైనది.
నియంత్రిత ప్రాంతాలు:
* గుడికి వెళ్ళే మార్గంలో ఇరువైపుల గల గృహ సముదాయాలకు వెళ్ళు మార్గములను కూడా బారికేడింగ్ ద్వారా నియంత్రించడం జరుగుతుంది.
* ఉత్సవాలు జరుగు ప్రాంతంలో పుష్ కార్ట్ లు మరియు జైంట్ వీల్స్ మరియు వినోదానికి సంబందించిన ఆటలు అనుమతించబడవు.
భక్తులకు విజ్ఞప్తి:
ఇస్కాన్ టెంపుల్ వారు జారీ చేసిన దర్శనం టికెట్స్ కలిగిన వారు, వారికి కేటాయించిన సమయంలో దర్శనానికి వచ్చి పోలీసులకు మరియు గుడి యాజమాన్యానికి సహకరించ వలసినదింగా కోరుచున్నాము.
ఇస్కాన్ టెంపుల్ వారు ప్రసాదాలు ఇచ్చుటకు గుడి లోపల 16 ప్రసాదం కౌంటర్ లను ఏర్పాటు చేయడమైనది. అందులో భక్తులు ప్రసాదాలు వరుస క్రమంలో వెళ్లి ప్రసాదాలు తీసుకొనవలెను.
కావున భక్తులు ఈ విషయాలు గమనించి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పోలీసులకు సహకరించ వలసినదిగా కోరడమైనది.
ప్రయాణికులకు సలహా:
మీ ప్రయాణానికి ముందుగానే ప్రణాళిక చేసుకోండి.. ప్రయాణానికి అదనపు సమయం ఇవ్వండి.
ట్రాఫిక్ సూచనలను పాటించండి.
గమనిక: ట్రాఫిక్ మళ్లింపు పరిస్థితిని బట్టి మార్పుకు లోబడి ఉంటుంది. దయచేసి స్థానిక ప్రజలు గమనించగలరు.
Tags:Srikrishna Janmashtami celebrations.. Traffic diversion in Tirupati city.