Natyam ad

తెప్పపై ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారి విహారం

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు మంగ‌ళ‌వారం సాయంత్రం ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.కాగా బుధ‌వారం నుండి శుక్ర‌వారం వరకు శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.
ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో  శాంతి, ఏఈవో  మునిక్రిఫ్ణా రెడ్డి, సూపరింటెండెంట్‌ నారాయ‌ణ‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Srikrishna Swamy Vihara along with Andal on the raft

Post Midle