శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి కపిలతీర్థంలో గల పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం చేపట్టారు. సాయంత్రం అగ్ని ప్రతిష్ట, కుంభస్థాపన, కుంభారాధన, విశేష హోమం నిర్వహించారు. సూర్యకుమార్ ఆచార్యులు కంకణభట్టారుగా వ్యవహరించారు. మే 14న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు మోహనరంగాచార్యులు, టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, డెప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.

Tags:Srilakshminarasimhaswamy temple Mahasamprokshan programs have started
