నిన్న శ్రీనివాస్ గౌడ్… ఇవాళ జీవన్ రెడ్డి…

-గులాబీలో రెక్కీల గోల

హైదరాబాద్ ముచ్చట్లు:


గులాబీ పార్టీ నేతలపై వరుసగా మర్డర్ స్కెచ్‌లు వెలుగు చూస్తుండడం తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీలో అలజడి రేగుతోంది. ఆ పార్టీ నేతలే టార్గెట్‌గా వరుసగా హత్య కుట్రలు బయటపడుతుండటం టెన్షన్ పెట్టిస్తోంది. మొన్నటికి మొన్న రాష్ట్ర కేబినెట్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మర్డర్ ప్లాన్‌ను పోలీసులు ఛేదించిన ఘటన మరువక ముందే తాజాగా మంగళవారం ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యకు కుట్ర కోణం దుమారం రేపుతోంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంట్లోకి దూరిన ఆర్మూర్‌కు చెందిన కల్లెడ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.తంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యకు కుట్ర కేసులో కనిపించిన పోలికలు తాజాగా జీవన్ రెడ్డి మర్డర్ స్కెచ్ అంశంలో కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో స్థానిక నాయకుల పేర్లు వెలుగు చూశాయి. వీరంతా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తప్పుల్ని బయటపెట్టడంతోనే మంత్రి హత్యకు కుట్ర అంటూ కేసులు పెట్టారని బీజేపీ ఆరోపించింది. రాష్ట్ర మంత్రిపై హత్యకు కుట్ర అనేది చాలా పెద్ద విషయమని ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిజానిజాలు తేలాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. అవాస్తవాలు, అభూత కల్పనలతో కథ అల్లినట్లు ఆమె ఆరోపించారు.జీవన్ రెడ్డి మర్డర్ ప్లాన్ విషయంలో ఇలాంటి పోలికే ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. హత్యకు కుట్ర చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రసాద్ గౌడ్.. జీవన్ రెడ్డి నియోజకవర్గానికి చెందిన వ్యక్తే. ఈ రెండు కేసుల్లోనూ నేతల హత్యలకు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. నిజానికి తాము మొదట్లో బీజేపీ సానుభూతిపరులమని ప్రసాద్ గౌడ్ భార్య లావణ్య చెప్పింది.

 

 

నిందితుడు ప్రసాద్ గౌడ్ భార్య సర్పంచ్‌గా ఉండటంతో వీరికి జీవన్ రెడ్డికి మధ్య కొంత కాలంగా విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై లావణ్య సర్పంచ్ పదవిపై వేటు పడింది. జీవన్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడని, జీవన్ రెడ్డికి పెద్ద మొత్తంలో భూములు ఎక్కడి నుండి వచ్చాయని వివరిస్తూ ప్రసాద్ గౌడ్ సెల్పీ వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈక్రమంలోనే జీవన్ రెడ్డిని చంపేందుకు కుట్ర కోణం వెలుగు చూడటం ఆసక్తికరంగా మారిందినిందితుడు ప్రసాద్ గౌడ్‌ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయన నేపాల్ గ్యాంగ్‌తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. నేపాలీ గ్యాంగ్‌కు రూ.50 వేల అడ్వాన్స్ ఇచ్చి వారి నుండి రెండు నాటు తుపాకులు తీసుకున్నాడని వాటితోనే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లాడని తెలుస్తోంది. ప్రసాద్ గౌడ్ వద్ద నుండి పోలీసులు ఒక ఎయిర్ గన్, మరో ఫిస్టల్‌తో పాటు ఓ ఆటోమెటిక్ నైఫ్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో మంత్రి శ్రీనివాస్ హత్యకు కుట్ర కేసులోనూ సుఫారీ గ్యాంగ్ ప్లాన్‌ను పోలీసులు ఛేదించారు. ఏకంగా మంత్రిని టార్గెట్ చేస్తూ హత్యకు సుపారీ గ్యాంగ్‌తో చేతులు కలపడం వంటి విషయాలు కలకలం రేపాయి.మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్ర కేసు ఘటన మరువక ముందే టీఆర్ఎస్ వాణిని బలంగా వినిపించే జీవన్ రెడ్డి మర్డర్‌కు వేసిన స్కెచ్‌ బహిర్గతం కావడంతో టీఆర్ఎస్ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోంది.

 

 

తమ పార్టీకి చెందిన నేతలపై కుట్రలు జరగడం వెనుక అసలేం జరుగుతోందనే ప్రశ్నలు కింది స్థాయి కార్యకర్తల నుండి వ్యక్తం అవుతోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వ్యక్తి ఆ తర్వాత కొద్ది రోజులకే ఏకంగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో దర్శనం ఇచ్చాడు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసినా అలాంటి ప్రయత్నాలు జరగలేదు. తాజాగా జీవన్ రెడ్డిని చంపేందుకు ఏకంగా నేపాలీ గ్యాంగ్‌తో ప్రసాద్ గౌడ్ కుట్ర చేశారనే ఆరోపణలు రావడంతో సర్వత్రా టెన్షన్ పెట్టిస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జీవన్ రెడ్డి విషయంలో అసలేం జరిగిందో తేల్చాలనే డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.జీవన్ రెడ్డి హత్యకు కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న ప్రసాద్ గౌడ్ భార్య లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను సర్పంచ్‌గా పని చేసిన కాలంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.18 లక్షలు రావాల్సి ఉందని లావణ్య చెబుతోంది. ఈ విషయాన్నే జీవన్ రెడ్డిని అడగడానికి వెళ్లిన తన భర్త ప్రసాద్ గౌడ్‌ను అక్రమ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించింది. తన భర్త వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని రాజకీయ కక్ష కట్టి ఈ విధంగా వేధిస్తున్నారని, తాము గతంలో బీజేపీలో ఉండేవాళ్లమని అనవసరంగా టీఆర్ఎస్‌లోకి వచ్చి అన్ని విధాలుగా నష్టపోయామని చెబుతోంది. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం బయట అప్పులు తెచ్చామని, వాటికి వడ్డి కింద నెలకు రూ.50 వేలు కడుతున్నామని వాపోయింది. మొత్తంగా జీవన్ రెడ్డి అంశంతో రాష్ట్ర రాజకీయాల్లో ‘మర్డర్ స్కెచ్’ పాలిటిక్స్ మరోసారి సంచనం రేపుతోంది.

 

Tags: Srinivas Goud yesterday… Jeevan Reddy today.

Leave A Reply

Your email address will not be published.