Date:18/01/2021
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ప్రధాన రోడ్డుపై తన వాహనంలో వెళ్తుండగా రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి స్పృహ కోల్పోయి కింద పడుతుండడం చూశారు. అకస్మాత్తుగా తన వాహనం దిగి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని గమనించి వెంటనే అతని చేతిలో తాళాలు పెట్టి కాపాడారు. వ్యక్తి మామూలు స్థితికి వచ్చిన తర్వాత దగ్గరుండి అతన్ని ఆస్పత్రికి పంపించాడు. మొన్న కరోనా సమయంలో చాలా సందర్భాల్లో అయన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ మహమ్మారి బారిన పడి చనిపోయిన వాళ్ల మృతదేహాల వద్దకు ఎవరు కూడా దగ్గరకు రాని సమయంలో మంత్రి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మళ్లీ ఇప్పుడు రోడ్డుపై అకస్మాత్తుగా ఈ వ్యక్తికి ఫీడ్స్ రావడం చూసి సహాయం అందించి మరొకసారి తన మానవత్వాన్ని చాటుకున్నరు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo
Tags: Srinivas Gowda, the minister who treated the epilepsy