జగదీష్ రెడ్డికి చుట్టుకుంటున్న శ్రీనివాస్ హత్య కేసు

Date:15/02/2018
నల్గొండ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర స‌మితిలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు తారాస్థాయికి చేరుతున్నాయ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే హ‌రీష్‌, కేటీఆర్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఎంపీ క‌విత కూడా ఈ సారి అసెంబ్లీ వైపు చూస్తుండ‌టంతో మ‌రికొంద‌రు త‌మ సీటుకు ఎక్క‌డ ఎస‌రు వ‌స్తుంద‌నే గంద‌రగోళానికి గుర‌వుతున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లోనే న‌ల్గొండ‌లో జ‌రిగిన మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ల‌క్ష్మీ భ‌ర్త శ్రీనివాస్ హ‌త్యోదంతం టీఆర్ఎస్ మెడ‌కు చుట్టుకుంది. త‌మ ప్ర‌మేయం లేద‌ని ఎత్తగా చెప్పినా.. ఎమ్మెల్యే వీరేశం ఫోన్‌కాల్ డేటాలో నిందితుల‌తో మాట్లాడిన‌ట్లు ఆధారాలు ల‌భించాయి. మ‌రోవైపు కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టిన ఇన్‌స్పెక్ట‌ర్ రెండుమూడ్రోజుల పాటు అదృశ్య‌మ‌య్యారు. కేసులో వ‌స్తున్న ఒత్తిళ్ల‌తోనే ఆయ‌న బాప‌ట్ల సూర్య‌లంక రిసార్ట్ కు చేరిన‌ట్లు తేలింది. న‌ల్ల‌గొండ జిల్లా.. ప్ర‌స్తుతం సూర్య‌పేట జిల్లాకు చెందిన మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపించ‌టం.. హ‌త్య‌లో ఈయ‌న ప్ర‌మేయం ఉన్న‌ట్లు కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంతేగాకుండా.. అక్ర‌మ సంపాద‌న‌తో కోట్లాదిరూపాయ‌లు కూడ‌బెట్టార‌ని వినికిడి. దీంతో సీఎం కేసీఆర్ జ‌గ‌దీష్‌రెడ్డిని దూరంగా ఉంచారనే ప్ర‌చారం ఊపందుకోంది. గ‌తంలో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు స్వేచ్ఛ‌గా వెళ్లే జ‌గ‌దీష్‌కు ప్ర‌స్తుతం సీఎం కార్యాల‌యంలోకి వెళ్లేందుకు అనుమ‌తి కూడా దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ట‌. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి  వెంక‌ట‌రెడ్డి.. జ‌గ‌దీష్‌రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్నారు. మంత్రిగారి బాగోతం అంతా త‌న వ‌ద్ద ఉందంటూ మీడియాకు వివ‌రించారు కూడా. మూడు వైపులా ముప్పేట జ‌రుగుతున్న దాడితో మంత్రివ‌ర్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో సీటు క‌ష్ట‌మేనంటూ పార్టీలో ప్ర‌చారం కూడా మొద‌లైంది. ఈ ప‌రిణామాల‌పై మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి మాత్రం.. త‌న‌కేం కాద‌నే ధీమాగా ఉండ‌టం విశేషం.  కేసీఆర్ వ‌ద్ద త‌న‌కు మంచి సంబంధాలున్నాయ‌ని.. కోమ‌టిరెడ్డి కావాల‌నే రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే ఈ నాట‌కం ఆడుతున్నారంటూ త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు కొట్టిపారేయ‌టం నిజంగా విశేష‌మే.
Tags:Srinivas murder case surrounding Jagdish Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *