ఆఫ్‌లైన్‌లో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం టికెట్లు
తిరుపతి ముచ్చట్లు:
హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో నవంబరు 23 నుంచి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ప్రారంభించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.ఇందుకోసం టికెట్ ధర రూ.1000/-గా నిర్ణయించారు. ఒక టికెట్‌పై ఇద్దరిని అనుమతిస్తారు.
రోజుకు ఆన్‌లైన్‌లో 50 టికెట్లు, ఆఫ్‌లైన్‌లో 50 టికెట్లు కేటాయిస్తారు. ఆన్‌లైన్ టికెట్లను నవంబరు 16న టీటీడీ విడుదల చేసింది. మొదటిరోజైన నవంబరు 23వ తేదీ హోమం ఆఫ్‌లైన్ టికెట్లను నవంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం వరకు సప్తగోప్రదక్షిణ మందిరం ప్రాంగణంలో జారీ చేస్తున్నారు. భక్తులు నేరుగా వచ్చి ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. నవంబరు 24వ తేదీ నుండి ఏరోజుకారోజు టికెట్లు మంజూరు చేస్తారు.

Tags: Srinivasa Divyanugrah Visheshhoma tickets online
