డల్లాస్ లో వైభవంగా శ్రీనివాసకళ్యాణం- పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

తిరుపతి ముచ్చట్లు:

అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.కళ్యాణోత్స క్రతువులో భాగంగాపుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. డల్లాస్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, విశాఖపట్నం ఎంపి  సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ ఆర్ ఐ సలహాదారు  జ్ఞానేంద్ర రెడ్డి, వై ఎస్ ఆర్ జిల్లా జెడ్ పి చైర్మన్  అమర్నాథ రెడ్డి, తెలుగుబాషా సంఘం చైర్మన్  లక్ష్మీ ప్రసాద్, ఉత్తర అమెరికా లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ రత్నాకర్, ప్రతాప్ భీమ్ రెడ్డి, ఏపీ ఎన్నార్టీ చైర్మన్  మేడపాటి వెంకట్,  రాజు వేఘ్నేశ, నాటా అధ్యక్షులు  శ్రీధర్ రెడ్డి,  రఘువీర్ బండారు,  రమేష్ వల్లూరు, ఎస్వీబీసీ డైరెక్టర్  శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Srinivasa Kalyanam in glory in Dallas – attended by a large number of devotees

Leave A Reply

Your email address will not be published.