Natyam ad

నవంబరు 9న ఒంగోలులో శ్రీనివాస కల్యాణం

తిరుమల ముచ్చట్లు:

టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 9 వతేదీ శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి డీపీపీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఒంగోలు శివారులోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా గల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. తిరుమల నుంచి శ్రీవారు ,అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఒంగోలు కల్యాణానికి తీసుకుని వెళతారు. తిరుమల ఆలయం నుంచి ప్రధానార్చకులు శ్రీ అర్చకులు హాజరై స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి సీనియర్ గాయకులు హాజరై సంకీర్తనలు ఆలపిస్తారు. టీటీడీ నుంచి పలువుర విభాగాల అధికారులు , సిబ్బంది పాల్గొంటారు.

 

Post Midle

Tags: Srinivasa Kalyanam in Ongolu on 9th November

Post Midle

Leave A Reply

Your email address will not be published.