సియాటెల్ లో శ్రీనివాసకళ్యాణం- ఉట్టిపడిన ఆధ్యాత్మిక శోభ
తిరుపతి ముచ్చట్లు:
టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సియాటెల్ నగరంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.
ప్రాంగణమంతా వేద మంత్రాలతోమారుమోగింది. కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, పీపుల్ టెక్ సంస్థ సీఎండీ , కళ్యాణోత్సవానికి ఆర్థిక సహకారం అందించిన టీజీ విశ్వప్రసాద్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:Srinivasa Kalyanam in Seattle- Awesome spiritual charm
