డిసెంబ‌రు 18 నుండి ప్ర‌కాశం జిల్లాలో శ్రీ‌నివాస క‌ల్యాణాలు

Srinivasan affairs in Prakasam district from 18th of December

Srinivasan affairs in Prakasam district from 18th of December

Date:08/12/2019

తిరుప‌తి ముచ్చట్లు:

శ్రీ‌వారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా, సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి శ్రీవారి కల్యాణాలను చూడలేని భక్తులకోసం టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో టిటిడి శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా డిసెంబ‌రు 18వ తేదీ నుండి ప్ర‌కాశం జిల్లాలో 7 ప్రాంతాల్లో శ్రీ‌నివాస క‌ల్యాణాలు జ‌రుగ‌నున్నాయి. ఆయా ప్రాంతాల్లోని రామాల‌యాల్లో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు క‌ల్యాణాలు నిర్వ‌హిస్తారు. శ్రీ‌నివాస క‌ల్యాణం ప్రాజెక్టు కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ ఈ క‌ల్యాణాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

– డిసెంబ‌రు 18న డోర్నాల మండలం రామచంద్రునికోట‌.

– డిసెంబ‌రు 19న వెలిగాండ్ల మండల కేంద్రం.

– డిసెంబ‌రు 20న హ‌నుమంతునిపాడు మండ‌లంలోని త‌క్కెళ్ల‌పాడు గ్రామం.

– డిసెంబ‌రు 21న వేట‌పాళెం మండ‌లంలోని వెంక‌ట‌సుబ్బ‌య్య‌పాళెం గ్రామం.

– డిసెంబ‌రు 22న కొత్త‌ప‌ట్నంలోని చాకిరేవు కాల‌నీ.

– డిసెంబ‌రు 23న టంగుటూరు మండ‌లంలోని కందులూరు గ్రామం.

– డిసెంబ‌రు 24న సింగ‌రాయ‌కొండ మండ‌లంలోని పాత సింగ‌రాయ‌కొండ గ్రామం.

 

మైనర్ బాలికపై అత్యాచారం

 

Tags:Srinivasan affairs in Prakasam district from 18th of December

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *