Natyam ad

శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో

తిరుమ‌ల ముచ్చట్లు:

శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మార్చి 1న ప్రారంభ‌మైన బ్ర‌హ్మోత్స‌వాలు 11వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి.ఆలయం వద్దకు చేరుకున్న ఈవోకు శ్రీ‌శైలం ఆలయ చైర్మన్ శ్రీ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో   పెద్దిరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. అనంత‌రం ఆలయ అధికారులు వీరికి తీర్థ, ప్రసాదాలు అందించారు.ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య
పారు పత్తేదారు   తుల‌సీ ప్ర‌సాద్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Post Midle

Tags:Srisailam is the one who offered silk clothes to Mallanna on behalf of Srivari

Post Midle