Natyam ad

శ్రీసంస్థానం ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభం

పిఠాపురం ముచ్చట్లు:


పేదప్రజల పిల్లలుకూడా విద్యాభివృద్ధి పొందాలని గొప్ప ఆశయంతో జిల్లాలో ఎన్నో విద్యాసంస్థల్ని,అన్నదానసత్రాల్ని నెలకొల్పిన గొప్ప దార్శనికుడు పిఠాపురం మహారాజా అని,ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పినిపే విశ్వరూప్,కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు.పిఠాపురం మహారాజా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ సంస్థానం ద్వారా పేద విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచితభోజనం కార్యక్రమం ప్రారంభోత్సవం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణాశాఖామంత్రి పినిపే విశ్వరూప్,ఎంపీ వంగా గీత హాజరయ్యారు.ముందుగా పిఠాపురం మహారాజా విగ్రహానికి మంత్రి పినిపే విశ్వరూప్,ఎంపీ గీత,ఎమ్మెల్యే దొరబాబు పూలమాలలువేసి,ఘనంగా నివాళులర్పించారు.అనంతరం  మంత్రి పినిపే విశ్వరూప్ చేతులమీదుగా పేద విద్యార్థులకు ఉచితభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం వైసీపీ యువజనవిభాగం నాయకుడు కొట్టేటి రాజేశ్ ఆధ్వర్యంలో మంత్రి విశ్వరూప్ ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్,ఎంపీ గీత,ఎమ్మెల్యే దొరబాబు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో ఈఓ వీ.వీర్రాజు,గండేపల్లి బాబీ,బాలిపల్లి రాంబాబు,రెడ్డెం జనార్ధన్,ఆగంటి ప్రభాకర్,రావుల మాధవరావు,కొత్తెం దత్తుడు,తుమ్మల బాబు,గుడాల రామకృష్ణ,కర్రి దుర్గాప్రసాద్,జవ్వాది ప్రసాద్,పచ్చిమళ్ళ అప్పలరాజు,పెదపాటి రాజేశ్,చోడిశెట్టి శ్రీను,బొజ్జా మాణిక్యాలరావు,ఉలవల భూషణం,పాలిక ప్రవీణ్,పెదపాటి నాగేశ్వరరావు,వర్ధినీడి సుజాత తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Srisansthanam free meal program started

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.