శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.3 కోట్ల 43 లక్షల పైగా నగదు
శ్రీశైలం ముచ్చట్లు :
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ,పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈలెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 3, కోట్ల 43, లక్షల 68, వేల 091 రూపాయల నగదు రాబడిగా లభించగా ఈ ఆదాయాన్ని గత 28 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదురూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు తెలిపారు ఈ హుండీలో మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం అధికారులపర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.
Tags: Srishaila Mallanna Hundi’s income is more than Rs.3 Crore 43 Lakh in cash

