పుంగనూరులో వైభవంగా శ్రీసుగుటూరు గంగమ్మ జాతర
-గ్రామాల్లో జాతర సందడి
– విందువినోదాలతో సందడి
పుంగనూరు ముచ్చట్లు:

జమీందారుల కుల దైవమైన సుగుటూరు గంగమ్మ జాతర రెండు రోజుల పాటు వైభవంగా పట్టణంలోను , గ్రామాల్లోను బుధవారం నిర్వహించారు. అమ్మవారికి తొలి, మలి పూజలు జమీందారులు నిర్వహించగా బెస్తవారు, యాదవ కులస్తులు, తోటి కులస్తులచే పూజలు ఘనంగా నిర్వహించారు. అలాగే పట్టణంలోని బజారువీధిలో నడివీధి గంగమ్మ , తూర్పు వెహోగసాలలో గంగమ్మ , బాలాజి •యేటర్ వద్ద మలారమ్మ గంగమ్మ, మైసూర్ బ్యాంకు వద్ద నలగంగమ్మ, బస్టాండులో విరూపాక్షి మారెమ్మ, నల్లరాళ్లపల్లె వద్ద నలగంగమ్మ , కోనేరు వద్ద బోయకొండ గంగమ్మ, నానాసాహెబ్‌పేటలోని నడివీధి గంగమ్మలను ఉంచి పట్టణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. అలాగే విరూపాక్షి మారెమ్మను పట్టణంలో పల్లకిలో ఉంచి ఊరేగించారు. అలాగే మంగళం, పిచ్చిగుండ్లపల్లె గ్రామాల్లో గ్రామ పెద్దలు , ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి దంపతులు తొలిపూజలు నిర్వహించారు. భక్తులు మట్టి కుండలకు మామిడి ఆకు, వేపాకు, పూలు పెట్టి గెరిగెలు తయారు చేసి గెరిగెలను మహిళలు, పురుషులు ల వేషధారణతో వచ్చి ఆలయంలో మూడు ప్రదక్షణలు చేసి , వెహోక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా బంధుమిత్రులతో కలసి విందు వినోదాలు నిర్వహించారు.
జాతర సందడి…
రెండు రోజుల జాతర సందర్భంగా పట్టణంలో ఎటుచూసినా మేళతాళాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు గుంపులుగుంపులుగా ప్యాలెస్‌లోనికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్యాలెస్ ఆవరణం జనసంద్రమైంది. భక్తి గీతాలతో పట్టణంలో సందడి నెలకొంది. ఆలయం ముఖద్వారం, ప్యాలెస్‌లోను, పట్టణంలోని ప్రధాన కూడలి ప్రాంతాల్లోను అమ్మవారి చిత్రాలను విద్యుత్ దీపాలతో తయారు చేశారు. అలాగే తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్, కెసిటివి వారు అమ్మవారి జాతరను ప్రత్యక్ష ప్రసారాలు చేశారు. డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
Tags; Srisuguturu Gangamma fair in Punganur
