పుంగనూరులో సింహవాహనంపై శ్రీవారి ఊరేగింపు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామిని గురువారం ఉదయం సింహవాహనంపై ఊరేగించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో నాల్గవరోజు ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అలాగే సాయంత్రం ముత్యపు పందిరిపై స్వామివారిని ఉంచి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామికి పూజలు చేశారు.

Tags; Srivari procession on lion chariot in Punganur
