Cases of misconduct on TTD

జూన్ 8 నుండి శ్రీ‌వారి పునర్దర్శ‌నం

-రోజుకు 3 వేల స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు, 3 వేల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టోకెన్లు జారీ

-టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి

Date:05/06/2020

తిరుమల ముచ్చట్లు:

కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ -19 లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించిన నేప‌థ్యంలో జూన్ 8వ తేదీ నుండి శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు   వైవి.సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం టిటిడి ఈవో   అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో   పి.బ‌సంత్‌కుమార్‌తో క‌లిసి ఛైర్మ‌న్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ మీడియా స‌మావేశంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. కరోనా వ్యాధి కారణంగా మార్చి 20వ తేదీ నుంచి భక్తులకు స్వామి దర్శనం నిలిపివేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో సుమారు 80 రోజుల తరువాత భక్తులకు స్వామి దర్శనం కల్పించబోతున్నాం. ఇందుకోసం ఈ నెల 8 వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా దర్శనం కల్పించబోతున్నాం.- జూన్ 8 ,9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు మరియు వారి గుర్తింపుకార్డు పై ఉన్న కుటుంబ సభ్యులకు ఇంట్రానెట్‌లో టైం స్లాట్ బుకింగ్ ద్వారా దర్శనం పొందడానికి, ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు టోకెన్లు జారీ చేస్తాం. 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వారికి ఇందులో అనుమతి లేదు.

 

జూన్ 10వ తేదీ తిరుమలలోని స్థానికులకు గంటకు 500 మంది చొప్పున తిరుమలలోని కౌంటర్ల లో టైం స్లాట్ టోకెన్ల జారీ. జూన్ 11వ తేదీ నుంచి ప్రతి రోజూ 3000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్ ద్వారా జూన్ 8వ తేదీ నుంచి జారీ చేస్తారు. సర్వదర్శనం టికెట్లు 3000 చొప్పున తిరుపతిలోనే కౌంటర్ల ద్వారా జారీ చేస్తారు. జూన్ 11 నుంచి రోజుకు 1 గంట మాత్రమే స్వయంగా వచ్చే విఐపిలకు బ్రేక్‌ దర్శనం ఉంటుంది. సిఫారసు లేఖలు స్వీకరించబడవు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అలిపిరి కాలి బాట మార్గంలో భక్తులను అనుమతిస్తారు. భక్తుల భద్రత దృష్ట్యా శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రస్తుతానికి మూసి ఉంచుతారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఘాట్ రోడ్లు తెరచి ఉంచుతారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు రాత్రి 9 నుండి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ ఉంటుంది. అలిపిరి టోల్గేట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్, వెహికల్ స్కానింగ్, హ్యాండ్ సానిటైజర్లు ఏర్పాటుచేసి ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేశాక ద‌ర్శ‌న టికెట్ ఉన్న వారిని మాత్ర‌మే తిరుమలకు అనుమతిస్తారు. దర్శనం, ఇతర వసతుల పర్యవేక్షణకు సీనియ‌ర్ అధికారుల నియామకం.

 

ప్రతి 2 గంటలకు గదుల శానిటైజేషన్‌ చేస్తారు. గదికి ఇద్దరికే అనుమతి. ఆల్ట‌ర్‌నేట్ పద్ధతిలో గదుల కేటాయింపు జరుగుతుంది. గదులు 24 గంటలకు మించి పొడిగింపు లేదు. కొండ మీద మఠాలు కూడా భక్తులకు ఇదే పద్ధతిలో గదులు కేటాయిస్తారు. తిరుపతిలో కూడా ఇదే విధంగా గదులు కేటాయిస్తారు. తిరుమలలోని కళ్యాణ మండపాల్లో వివాహాలు చేసుకోవాలనుకున్న వారు ముందుగా ఆరోగ్య శాఖ అధికారి నుంచి అనుమతి పొందాలి. 50 మందికి మాత్రమే అనుమతి. అలిపిరి కాలిబాట, క్యూ కాంప్లెక్స్ లలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిరంతరాయంగా 5 భాషల్లో అనౌన్స్మెంట్ చేస్తాం. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి, శానిటైజ‌ర్‌తో చేతులు శుభ్ర‌ప‌ర‌చుకోవాలి. కనీసం రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది.

 

– మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్‌లో మాత్రమే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నదానం. కరోనా నేపథ్యంలో భక్తులతో ముందు జాగ్రత్త చర్యలతో ఎలా వ్యవహరించాలనే అంశం మీద కొండ మీది వ్యాపారులకు అవగాహన కల్పిస్తాం. ఆరోగ్య కార్మికులు, విజిలెన్స్, శ్రీవారి సేవకులు, కళ్యాణకట్ట క్షురకులతో పాటు భక్తులకు దగ్గరగా విధులు నిర్వహించే సిబ్బందికి పీపీఈ కిట్లు అందిస్తాం. స్వామివారి దర్శనం లేనందు వల్ల కనీసం ప్రసాదం అయినా అందించాలని భక్తుల నుంచి వినతులు అందాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో మాత్రమే కాకుండా హైదరాబాదు, బెంగళూరు నగరాల్లో లడ్డూప్రసాదం అందించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ర్యాండ‌మ్‌గా రోజుకు 200 మంది భక్తుల శాంపిల్స్ తీసుకుని కోవిడ్-19 టెస్టులు చేయడం జ‌రుగుతుంది. ఇందుకోసం అలిపిరి, తిరుమల అశ్విని ఆసుప‌త్రిలో శాంపిల్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా స్విమ్స్‌లో టీటీడీ ఉద్యోగులు మరియు భక్తుల కోసం కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తున్నాం.

 

 

– కరోనా పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని అలిపిరిలో భక్తులందరి నుంచి డిక్లరేషన్ తీసుకుంటాం. కంటైన్మెంట్ జోన్ల‌లో ఉన్న భక్తులు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవద్దని కోరుతున్నాము. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. దర్శనం టికెట్ తిరుమలకు రావడానికి అనుమతి పత్రం కాదు అని భక్తులు గమనించగలరు.శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌మోక్తంగా కైంక‌ర్యాలు : టిటిడి ఈవోఅనిల్‌కుమార్ సింఘాల్‌లాక్‌డౌన్ కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం నిలుపుద‌ల చేసిన‌ప్ప‌టికీ కైంక‌ర్యాల‌ను ఆగ‌మోక్తంగా, ఉత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించామ‌ని టిటిడి ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామాల‌యంలో మార్చి 23 నుండి 31వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు, ఏప్రిల్ 2న శ్రీ‌రామ‌న‌వ‌మి, ఏప్రిల్ 2 నుండి 11వ తేదీ వ‌ర‌కు ఒంటిమిట్ట శ్రీ కోదండరామాల‌యంలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాలు, ఏప్రిల్ 5 నుండి 7వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు, మే 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, మే 11 నుండి 13వ తేదీ వ‌ర‌కు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు,

 

 

 

మే 31న తిరుమ‌ల‌లో శ్రీ భోగ‌శ్రీ‌నివాసమూర్తికి ప్ర‌త్యేక స‌హ‌స్రక‌ల‌శాభిషేకం, జూన్‌ 2 నుంచి 10వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, జూన్‌ 4 నుంచి 6వ తేదీ వరకు శ్రీ‌వారి ఆల‌యంలో జ్యేష్టాభిషేకం త‌దిత‌ర ఉత్స‌వాలు నిర్వ‌హించామ‌ని వివ‌రించారు. మార్చి 26 నుండి 28వ తేదీ వ‌ర‌కు తిరుమలలో శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వ‌హించామ‌న్నారు. టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆదేశాల మేర‌కు ఏప్రిల్ 10వ తేదీ నుండి ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం అవుతున్న “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భించింద‌న్నారు.

 

 

 

కోవిడ్‌-19 నేప‌థ్యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభించిన త‌రువాత క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తామ‌ని ఈవో తెలిపారు. మెట్ల మార్గంలో అన‌ధికార హాక‌ర్ల‌ను అనుమ‌తించ‌బోమ‌న్నారు. దుకాణాల్లో కాలం చెల్లిన తినుబండారాలు, ఇత‌ర ప‌దార్థాల‌ను విక్ర‌యించ‌రాద‌న్నారు. తిరుమ‌ల‌లో పుష్క‌రిణిలో భ‌క్తులు స్నానం చేసే అవ‌కాశం ఉండ‌ద‌ని తెలిపారు. ఆల‌యంలో హుండీ వ‌ద్ద హెర్బ‌ల్ శానిటైజ‌ర్‌ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతామ‌ని చెప్పారు. ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పాద‌ర‌క్ష‌ల కోసం ప్ర‌త్యేక ర్యాక్‌లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ల‌గేజిని శానిటైజ్ చేసిన త‌రువాతే భ‌క్తుల‌కు అప్ప‌గిస్తామ‌ని తెలిపారు. టిటిడి స్థానికాల‌యాల్లోనూ భౌతిక దూరం పాటించి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తామ‌ని వెల్ల‌డించారు.

 

 

 

ద‌ర్శ‌న టికెట్ ఉన్న‌వారిని మాత్ర‌మే తిరుమ‌లకు అనుమ‌తి : టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి స‌ర్వ‌దర్శ‌నం టికెట్ లేదా ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ ఉన్న భ‌క్తుల‌ను మాత్ర‌మే అలిపిరిలో క్షుణ్ణంగా త‌నిఖీ చేసి తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని దుకాణ‌దారుల గుర్తింపుకార్డుల‌ను త‌నిఖీ చేసి అనుమ‌తిస్తామ‌ని చెప్పారు. ఇత‌ర రాష్ట్రాల భ‌క్తులు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించాల‌ని, ద‌ర్శ‌న టికెట్ వారికి అనుమ‌తి ప‌త్రం కాద‌ని తెలియ‌జేశారు. రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌కు సంబంధించిన ఒక నెల కోటాను జూన్ 8న ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తామ‌న్నారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు తిరుప‌తిలోని స‌ర్వ‌ద‌ర్శ‌నం కౌంట‌ర్ల‌లో అందుబాటులో ఉంటాయ‌న్నారు. ఒక రోజు ముందుగా వీటిని భ‌క్తుల‌కు కేటాయిస్తామ‌ని తెలిపారు.

ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం

Tags: Srivari reappears from June 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *