Srivari Vasanthotsavam

శ్రీవారి వసంతోత్సవం

Date:21/10/2020

తిరుమల ముచ్చట్లు:

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంటలకు వ‌సంతోత్స‌వం జ‌రిగింది. వసంత ఋతువులో స్వామికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించుటమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించుట కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. బ్రహ్మోత్సవాలలోస్వామి, అమ్మ‌వార్లు ఉద‌యం, సాయంత్రం అలంకరణలు, వాహనసేవల్లో పాల్గొని  అలసి వుంటారు కావున ఉపశమనం కల్పించేందుకు  వసంతోత్సవాలు నిర్వహిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

పుష్ప‌క విమానంలో గోవర్ధన కృష్ణుడు రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Tags: Srivari Vasanthotsavam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *