Natyam ad

పుంగనూరులో మోహిని అలంకార ంలో శ్రీవారు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోనేటివద్ద వెలసియున్న శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్గ్మత్సవాలలో భాగంగా ఐదవ రోజు శుక్రవారం స్వామివారిని మోహిని అలంకారంలో ఊరేగింపు నిర్వహించి పూజలు చేశారు. టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ మునీంద్రబాబు ఆధ్వర్యంలో ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు బృందంచే హోమాలు, అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి పూజలు చేశారు. గోవిందనామస్మరణలతో ఆలయం భక్తిపారవశ్యమైంది. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Srivaru in Mohini Alankara at Punganur

Post Midle