Natyam ad

పుంగనూరులో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోనేటి వద్ద వెలసియున్న శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి శనివారం సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ మునీంద్రబాబు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు ఆలయంలో హోమాలు , అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవ మూర్తులను సూర్యప్రభ వాహనంలో అలంకరించి తిరుమాడ వీధులలో ఊరేగింపు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై , స్వామివారికి  మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యమైంది.

 

Post Midle

Tags: Srivaru on Suryaprabha vehicle in Punganur

Post Midle