జూన్ 3న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ రాతి మండ‌ప‌మున‌కు శ్రీ‌వారు

తిరుమ‌ల‌ ముచ్చట్లు :

 

భక్తుడి చెంతకు భగవంతుడు రావడం అనే ఆర్యోక్తికి తార్కాణంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి పరమభక్తురాలైన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ రాతి గృహ‌మున‌కు ముందు ఉన్న రాతి మండ‌ప‌ము వ‌ద్ద‌కు జూన్ 3వ తేదీన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామివారు విచ్చేయ‌నున్నారు.ప్ర‌తి ఏడాది న‌ర‌సింహ జ‌యంతి త‌రువాత‌ 10వ రోజున‌ స‌హ‌స్ర దీపాలంకార సేవ అనంత‌రం ఉత్త‌ర మాడ వీధిలోని రాతి మండ‌ప‌ము వ‌ద్ద‌కు శ్రీ‌వారు ఉభ‌య దేవేరుల‌తో క‌లిసి ఊరేగింపుగా వేంచేపు చేసి ప్ర‌త్యేక ఆస్థానం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితిగా వ‌స్తుంది.

 

చారిత్రాక ప్రాశ‌స్త్యం :

తిరుమ‌ల‌లో తాళ్ళ‌పాక అన్న‌మాచార్యుల వారి రాతి గృహ‌ములో త‌రిగొండ వెంగ‌మాంబ కొన్ని సంవ‌త్స‌రాల పాటు నివ‌సించిరి. ఆ స‌మ‌యంలో తాళ్ళ‌పాక అన్న‌మాచార్యుల కుమారులు త‌మ గృహ‌మున‌కు ముందు రాతి మండ‌ప‌ము నిర్మించి అందులో స్వామివారిని వేంచేపు చేసి ఉత్స‌వాలు నిర్వ‌హించేవారు. ఈ ఆన‌వాయితీని అనుస‌రించి వెంగ‌మాంబ‌ కూడా త‌న ఇంటికి స్వామివారిని వేంచేపు చేసి ఉత్స‌వం చేయ‌డం ప్రారంభించిన‌ట్లు పండితులు తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Srivaru to Vengamamba stone mandapam on June 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *