మంత్రి పెద్దిరెడ్డిచే శ్రీవీరాంజనేయస్వామి పుస్తక ఆవిష్కరణ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీవీరాంజనేయస్వామి చరిత్రపై రచించిన పుస్తకాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం తిరుపతిలో ఆవిష్కరించారు. ఆంజనేయస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు , ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈనెల 22 వరకు నిర్వహించనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేసి ఆలయ పునఃనిర్మాణం, ప్రహారీతో పాటు స్వామివారి పుష్కరణిని నిర్మించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఈనెల 25న పాల్గొని , ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ చరిత్రపై విడుదల చేసిన పుస్తకాన్ని ఎంతో బాగ రచించారని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మణి, గణపతి, గంగాధర్, ఈ.మణి, మంజునాథ్, భాస్కర్, సతీష్, ప్రవీన్, హిమవంత్, శ్రీనివాసవెహోదలి తదితరులు పాల్గొన్నారు.

పూజా కార్యక్రమాలు ప్రారంభం….
పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీవీరాంజనేయస్వామి ఆలయ పునః ప్రతిష్ఠా కార్యక్రమాల పూజలు ఆదివారం వైభవంగా ప్రారంభించారు. కలిశస్థాపన, ధ్వజస్తాంభం, మహాకుంభాభిషేక పూజలు చేసి , అంకురార్పణ గావించారు. 22 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో వేదపండితులు నిత్య హ్గమాలు నిర్వహించనున్నారు. 22న స్వస్థివాచన, మహాపూర్ణాహుతి తో పాటు స్వామివారికి కలన్యాసము, బ్రహ్మఘోష ఆశీర్వాచనం నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు.
Tags; Sriveeranjaneyaswamy book launch by Minister Peddireddy
