ఏపీలో ఎస్ ఎస్ సీ పరీక్షలు

విజయవాడ  ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జులై 6 ప్రారంభంకానున్నాయి. 2021-22 పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన స్టూడెంట్స్‌కు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే హాల్ టికెట్స్ కూడా విడుదల చేశారు. ఇంకా కొందరు తీసుకోవాల్సి ఉందని ఈరోజు మిగిలిన విద్యార్ధులు తీసుకుని గురువారం నుంచి  పరీక్షకు హాజరుకావాలని స్కూల్ల ప్రిన్సిపాల్లు తెలిపారు. జులై 6 నుంచి 15 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిముషాల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. దాదాపు 2,01,627ల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. సీఎం చేతులమీదగా ఈ రోజు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రతి విద్యార్ధికీ దాదాపు రూ.2 వేలు విలువైన జగనన్న విద్యా కానుక కిట్లను అందించనున్నారు. విద్యాకానుక కోసం మూడేళ్లలో ఇప్పటివరకు రూ.2, 368.33 కోట్లు ప్రభుత్యం వ్యయం చేసింది. 2018–19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతి వరకు 37.21 లక్షలుగా ఉన్న విద్యార్ధుల సంఖ్య 47 లక్షలకుపైగా పెరిగింది. ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య ప్రస్తుతం 72.47 లక్షలకు చేరిందని విద్యాశాఖ ఈ సందర్భంగా తెలిపింది.

 

Tags: SSC Exams in AP

Leave A Reply

Your email address will not be published.