ఎస్సై తుది రాతపరీక్ష ప్రాథమిక “కీ” విడుదల..
అమరావతి ముచ్చట్లు:
ఏపీలో ఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.శని, ఆదివారాల్లో విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.మొత్తంగా ఈ పరీక్షలు రాసేందుకు 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించగా శనివారం (అక్టోబర్ 14) జరిగిన పేపర్-1 (ఇంగ్లిష్), పేపర్-2 (తెలుగు) పరీక్షలకు 30,585 మంది అభ్యర్థులు హాజరయ్యారు.రెండో రోజైన ఆదివారం (అక్టోబర్ 15) జరిగిన పేపర్-3 (అరిథ్‌మెటిక్, మెంటల్ ఎబిలిటీ) పరీక్షకు 30,569 మంది, పేపర్-4(జనరల్ స్టడీస్) పరీక్షకు 30,560 మంది హాజరయ్యారు.పేపర్-3, 4 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ప్రాథమిక కీలను ఏపీ ఎస్‌ఎల్‌పీఆర్‌బీ(APSLPRB) విడుదల చేసింది.సమాధానాలపై అభ్యంతరాలను అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్‌లో slprbap.obj@gmail.comకు మెయిల్‌లో పంపాలని సూచించింది.అనంతరం తుది కీతో పాటు ఫలితాలు వెలువరించనున్నారు.ప్రశ్నా పత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో https://slprb.ap.gov.in/ అందుబాటులో ఉంచారు..పేపర్ -III ప్రిలిమినరీ కీ కోసం క్లిక్ చేయండి..పేపర్- IV ప్రిలిమినరీ కీ కోసం క్లిక్ చేయండి.

Tags:SSI Final Written Exam Primary “Key” Released..
