కల్లు ఇవ్వలేదని కత్తితో పోడిచాడు

Date:5/08/2020

సంగారెడ్డి ముచ్చట్లు:

కల్లు కోసం ఓ సైకో కత్తితో దాడి చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కల్లు ఉద్దెర ఇవ్వలేదన్న నెపంతో కల్లు విక్రయదారులు ముగ్గురిపై బేగరి హనుమాన్ దాస్ కత్తితో దాడి చేసాడు.
బస్వాపూర్ గ్రామానికి చెందిన హనుమాన్ దాస్ అనే వ్యక్తి రోజులాగే  కల్లు సేవించేందుకు  కల్లు  దుకాణానికి వెళ్లాడు. అక్కడ కౌంటర్ పై కూర్చున్న జోగయ్య ను  హనుమాన్ దాస్  కల్లు ఉద్దెర కి అడిగాడు. ఈ డిపో కి ఓనర్ నేను కాదని, ఓనర్ వచ్చిన తర్వాత   కల్లు తీసుకో అని చెప్పి జోగయ్య, హనుమాన్ దాసు కల్లు ఇవ్వలేదు. దీంతో ఇరువురికి మాటా మాటా పెరిగి తగాదానికి దారి తీసింది. తనకు తాగడానికి కల్లు ఇవ్వలేదని హనుమాన్ దాస్ ఇంటికి వెళ్లి కత్తి తీసుకు వచ్చి జోగయ్య పై కత్తితో దాడి చేశాడు. ఇది తెలుసుకున్న జోగయ్య సోదరులు రాజు, రవి కూడా హనుమాన్ దాస్ ను మందలించడానికి వెళ్లగా వారిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన డిపో లోని స్థానికులు హనుమాన్ దాస్ ను పట్టుకునే క్రమంలో నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన క్షతగాత్రులకు తీవ్ర రక్తస్రావం కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

మూడు రాజధానులు చట్టం కోర్టులో నిలబడదా?

Tags:Stabbed with a knife that did not give the stone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *