Natyam ad

ఉపాధిహామీతో సుస్థిరమైన ఆస్తులు ఏర్పాటుచేసుకోవచ్చు

— పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
–వందరోజులు పనిపొందండి
— భూగర్భజలాలు పెంచుకుంటేలాభం

 

చౌడేపల్లె ముచ్చట్లు:

Post Midle

ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పనులతో పాటు వ్యక్తిగతంగా స్రుస్థిరమైన ఆస్తులను ఏర్పాటుచేసుకోవచ్చునని స్టేట్‌ రిసోర్స్ పర్సన్‌ జెఎస్‌ రాజు సూచించారు.సోమవారం మండలంలోని కొండామర్రి సర్పంచ్‌ జయసుధమ్మ అధ్యక్షతన డిఆర్‌పి నరేంద్ర బాబు ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనులపై సామాజిక తనిఖీ గ్రామసభ జరిగింది.ఈ సంధర్బంగా ఏర్పాటుచేసిన గ్రామసభలో ఎస్‌ఆర్పీ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా సుమారు రూ7 కోట్ల వ్యయంతో చేపట్టిన 1750 పనులను వారం రోజులుగా 11 మంది డిఆర్పీలు తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. కొండామర్రి , ఆమినిగుంట, పందిళ్లపల్లె, గడ్డంవారిపల్లె,కాటిపేరి, చింతమాకులపల్లె,శెట్టిపేట పంచాయతీల్లో సామాజిక తనిఖీ గ్రామసభలు నిర్వహించారు.ప్రభుత్వం పేదల కోసం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌ కార్డు కల్గిన ప్రతి కుటుంబం వందరోజులు పనిపొందాలన్నారు. భుగర్భజాలలు పెంచడం కోసం కుంటలు, పారంఫండ్‌ పనులు చేపట్టుకోవాలని రైతులకు సూచించారు.కొండామర్రి పంచాయతీ పరిధిలో 84 పనులు చేపట్టారన్నారు. మూడు రోజులపాటు జరిగిన పనులను రికార్డుల ఆధారంగా క్షేత్ర పరిశీలన చేసి నివేదికలు అందజేశారు. గ్రామస్థాయిలో పథకాలను పారదర్శకంగా అమలు చేయడమే సామాజిక తనిఖీ భాధ్యతను గుర్తుచేశారు.రైతులు ,కూలీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ముందుకెళ్ళాలని సూచించారు. పండ్లతోటలపెంపకం పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫారంపండ్‌ పనుల ద్వారా వరిపంట, మామిడి తోటలపెంపకం పనులు చక్కగా చేశారని అభినందించారు. అనంతరం కూలీల హక్కులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుకుమార్‌, విఆర్వో అశోక్‌రెడ్డి, గ్రామస్తులు నాగభూషణరెడ్డి, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Tags: Stable assets can be established with employment guarantee

Post Midle