ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరత

విజయనగరం ముచ్చట్లు:
 
ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఇప్పు ప్రైవేట్ హాస్పటల్స్ కు వరంగా మారింది. ఆసరాగా తీసుకోని కార్పొరేట్ హాస్పటల్ యాజమాన్యాలు నిబంధనలకు యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన వైద్య ఆరోగ్య శాఖ ప్రేక్షక పాత్ర పోషించడంతో అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లా విజయనగరం. జిల్లాలో అత్యధిక శాతం మంది సామాన్య, మధ్య తరగతి ప్రజలు. కాయ కష్టం చేస్తూ జీవనం సాగించినవారే.  అనారోగ్యం వస్తే.. గవర్నమెంట్ హాస్పటల్ నే ఆశ్రయిస్తారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత, నిర్లక్ష్యంతో అక్కడ వైద్యం సామాన్యుడికి అంతంత మాత్రమే అందుతుంది. దీంతో అనారోగ్యం బారిన పడిన వారు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వ్యయప్రయాసలు పడి కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.  రోగి హాస్పటల్ కు రావడమే తడవు… కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వైద్య పరీక్షలు జరిపి వేలాది రూపాయలు కాజేస్తున్నారు. దగ్గుకైనా జలుబుకైనా ఏ ఒక్కదానికైనా రక్తపరీక్షలు తప్పనిసరి చేసేశారు. దీంతో రోగి జేబుకు చిల్లు పెడుతున్నారు. అసలు వైద్య, రక్త పరీక్షలకు ఏంతెంత తీసుకోవాలి రోగి వ్యాధిని బట్టి సంబంధిత వైద్యుడు ఫీజు ఎంత అనేది కూలంకషంగా రాస్తూ డిస్ ప్లే బోర్డును ప్రతి కార్పొరేట్ ఆసుపత్రి వద్ద పెట్టాలనేది ప్రభుత్వ నిబంధన.కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రభుత్వ నిబంధనలు మేరకు రోగులుకు వైద్యసేవలు అందుతున్నాయా. ప్రభుత్వ నిబంధనలను యాజమాన్యాలు అమలు చేస్తున్నాయా లేదా పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పై ఉంది.
 
 
 
పరిపాలనను పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కాసులుకు కక్కుర్తిపడి కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.  అధికారులు అండదండలుతో అడ్డగోలుగా సంపాదించేందుకు వెనుకడుగు వేయడం లేదు. ప్రభుత్వ నిబంధనలు మేరకు రోగి యొక్క పరిస్థితి రోగి వ్యాధి విషయం, దాని పరిణామాలును ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంది.  జిల్లాలో ఒకటి రెండు చిన్న హాస్సటల్స్ తప్ప… జిల్లాలో ప్రయివేట్ ఆసుపత్రిలో నిబంధనలను పాటించిన దాఖలాలు లేవు. జిల్లాలో ఉన్నత స్థాయి అధికారులు.. ప్రజప్రతినిధులు అండదండలతో రోగులు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వ నిబంధనలను ఉల్లగించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తుండంతో కార్పొరేట్ సంస్థలు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
ప్రజాసమస్యలు పట్టించుకోవాల్సిన పాలకులుకు… ప్రజల ప్రాణాలు కన్నా పైరవీలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజాసమస్యలను పట్టిచుకోవడం లేదు. అందుకే ప్రైవేటు యాజమాన్యాలు సంపాదనే లక్ష్యంగా రోగులు వద్ద నుంచి లక్షలాది రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Staff shortage in government securities

Leave A Reply

Your email address will not be published.