జగనన్న ప్రభుత్వానికి అండగా నిలవండి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటు , వారి కష్టాలు గుర్తించి పరిష్కరిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి అండగా నిలవాలని మైనార్టీ సెల్ సీమజిల్లాల ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ఏటిగడ్డపాళ్యెం, మసీదువీధి ప్రాంతాలలో మా నమ్మకం నువ్వే జగన్…మా భవిష్యత్తు జగనన్నే కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము లు ఇంటింటా పర్యటించారు. అలాగే కౌన్సిలర్లు నటరాజ, కాంతమ్మ, రేష్మా, మమత, రెడ్డెమ్మ, సుప్రియ, ఆదిలక్ష్మీ, నరసింహులు, జెపి.యాదవ్, సాజిదాబేగం, త్యాగరాజు, అర్షద్‌అలీ, కిజర్‌ఖాన్, రాఘవేంద్ర లు తమ వార్డులలో పర్యటించారు. కరపత్రాలు పంపిణీ చేసి , స్టిక్కర్లు అంటించారు. ప్రశ్నలకు సమాధానాలు సేకరించి , ముఖ్యమంత్రి సెల్‌కు మిస్‌డ్‌కాల్ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో రమణ, రాజేష్, సురేష్, మహబూబ్‌బాషా, ఖాదర్‌బాషా , జావీద్ తదితరులు పాల్గొన్నారు.

Tags; Stand by Jagananna Govt
