ఏలూరులో ఉపాకర్మల భవనం ప్రారంభం

Date:19/10/2018

ఏలూరు ముచ్చట్లు:

ఏలూరు పట్టణంలో బ్రాహ్మణుల ఉపాకర్మల భవనాన్ని సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేసి నిర్మించారు. ఈ భవనాన్ని ఎమ్మెల్యే కోటారామారావు, ఏపిబిఎస్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్‌, పశ్చిమ గోధావరి జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు దుర్గాప్రసాద్‌, కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సోసైటి చైర్మన్‌ శ్రీశ్రీ శర్మతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ బ్రాహ్మణుల సమిష్టి కృషితో భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. భవన నిర్మాణానికి సహకరించిన ఎంపి మాగాంటిబాబు , మేయర్‌ పెదబాబు, ఎమ్మెల్సీలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ ప్రతి నిధులు కోవచీరు సతీష్‌శర్మ, మధుబాబు, యామిజాల నరసింహామూర్తి, రాంబాబు, నిత్యల శైలజ, అంభికాక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

కేసీఆర్ మైండ్ గేమ్ – ప్రతి వ్యూహాల్లో ప్రతిపక్షాలు

Tags: Start building in Eluru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *