వైద్య సేవలు ప్రారంభించండి

హైదరాబాద్ ముచ్చట్లు:
 
ఆదిలాబాద్ ఆర్జీఐఎమ్‌ఎస్‌, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలల్లో తగిన సిబ్బందితో వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని, RGIMS ఆదిలాబాద్‌కు బకాయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను
కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి నేడు (మార్చి 4) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.
కాగా దేశంలోని సామాన్య ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని, వైద్య కళాశాలల్లో సౌకర్యాలను పెంపొందించి, నాణ్యమైన వైద్య విద్యను
అందించాలన్న లక్ష్యంతో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన పథకాన్ని 2003 లో ప్రారంభించింది. కొత్తగా AIIMS
సంస్థలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ వైద్య కళాశాలలను/సంస్థలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పరచడం అనేవి ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన పథకం ముఖ్య లక్ష్యాలు.
ప్రభుత్వ వైద్య కళాశాలలను అభివృద్ధి పరచడంలో భాగంగా 150 నుంచి 250 వరకు అదనపు పడకలను ఏర్పాటు చేయడం, కొత్త ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు, 8 నుంచి 10 వరకు సూపర్
స్పెషాలిటీ విభాగాల ఏర్పాటు, దాదాపు 15 అదనపు పీజీ సీట్లను కేటాయించడం వంటి కార్యక్రమాలను చేపట్టాడం జరుగుతుంది. ఈ పథకం మూడవ విడతలో భాగంగా ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలకు (ఒక్కొక్క సంస్థకు) అత్యధికంగా రూ.120 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అత్యంత వేగంగా అభివృద్ధి
 
 
చెందుతున్న ఆదిలాబాద్, వరంగల్ పట్టణాలలో నాణ్యమైన వైద్య సేవలను ఎక్కువమంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఈ రెండు సంస్థలను ఎంచుకోవడం జరిగింది.ఐతే కోవిడ్
కారణంగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో జరిగిన జాప్యం కారణంగా ఆదిలాబాద్, వరంగల్ లోని ఈ రెండు సంస్థల అభివృద్ధి పనులు చాలా ఆలస్యంగా పూర్తయ్యాయి. ఈ కారణాల రిత్యా ఈ రెండు
నిర్మాణాలు గత ఏడాది అక్టోబర్ నెలలో పూర్తయ్యాయి. ప్రజలకు పెద్ద ఎత్తున అవసరమవుతున్న వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, తగిన సిబ్బందితో ఈ రెండు సంస్థలలో వెంటనే సేవలను
ప్రారంభించాలని, అలాగే RGIMS ఆదిలాబాద్ విషయంలో బకాయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేసీఆర్‌కు మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ రాశారు.
 
Tags: Start medical services

Leave A Reply

Your email address will not be published.