డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం

హైదరాబాద్   ముచ్చట్లు:
రాష్ట్రంలో పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం సాయి చరణ్ కాలనీ, టి అంజయ్య నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను హోం మంత్రి మహమూద్ అలీ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్  గద్వాల్ విజయలక్ష్మిల తో కలిసి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేద బడుగు బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూం కట్టిస్తున్నది కెసిఆర్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ఇల్లు కట్టించడమే కాదు వారి ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి కూడా చేసేందుకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ప్రభుత్వం ఇస్తుందని ఇంత మంచి ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇళ్లను అధికారుల సమక్షంలో కేటాయించడం జరుగుతుందన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Starting a double bedroom house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *