రైతు బంధు తో పెరిగిన సాగు విస్తీర్ణం

– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 

హైదరాబాద్ ముచ్చట్లు :

 

54.37 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.5145.87 కోట్లు జమ అయింది. – ఐదవరోజు 4.90 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1050.10 కోట్లు జమ చేసాం. – మొత్తం 102.92 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందిందని – రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.మంత్రి మాట్లాడుతూ  అత్యధికంగా నల్లగొండలో ఇప్పటి వరకు 3,97,260 మంది రైతులకు రూ.401.92 కోట్లు అందాయి.  అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 27,819 మంది రైతులకు రూ.19.68 కోట్లు వచ్చాయి.  నల్గొండ తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,35,549 మంది రైతులకు రూ.254.62 కోట్లు, మూడోస్థానంలో సంగారెడ్డి జిల్లా 2,66,797 మంది రైతులకు రూ.247.67 కోట్లు అందాయి.  రైతుబంధు సాయంతో రాష్ట్రంలో అనూహ్యంగా  సాగు విస్తీర్ణం  పెరిగింది.  రాష్ట్రంలో వస్తున్న పంటల దిగుబడే దీనికి నిదర్శనమని అన్నారు.

 

 

 

ఆకలికేకల తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారింది.  తెలంగాణ ఆవిర్భావ సమయంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను 29.26 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని గోదాములతో పాటు రైతు వేదికలు, కాటన్ మిల్లులు, అవకాశం ఉన్న ప్రతిచోటా ధాన్యం నిలువచేయడం జరిగింది.  వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్  ఇచ్చిన  ప్రాధాన్యత మూలంగానే ఇది సాధ్యం అయిందని అన్నారు.  ధాన్యం కొనుగోళ్ల గురించి విమర్శలు చేసే విపక్షాలు ముందు ఇంత ఉత్పత్తి ఎలా సాధ్యమయిందో అర్ధం చేసుకుని మాట్లాడాలి.  2014 – 15 లో వానాకాలం, యాసంగి కలిపి 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే కేవలం 2021 ఈ యాసంగి లోనే 90.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడంల జరిగిందని మంత్రి అన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: State Agriculture Minister Singireddy Niranjan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *