రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక విడుదల

తాడేపల్లి  ముచ్చట్లు :
సీఎం వైఎస్ జగన్ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసారు. 2.83 లక్షల కోట్ల రుణ ప్రణాళిక రూపొందించారు. 1.48 లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించారు. మొత్తం ప్రాథమిక రంగానికి 2.13 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయం జరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గత ఏడాది లక్ష్యాలను సాధించాం…ఈ ఏడాది కూడా సాధిస్తాం. ప్రభుత్వ ప్రాధాన్య  కార్యక్రమాలకు బ్యాంకర్లు సహకారం అందించాలని కోరామని అన్నారు.  వైద్య కళాశాలలు, జగన్నన్న కాలనీల అబివృద్ది వంటి వాటికి సహకటించాలని సీఎం కోరారు. కోవిడ్ ఇబ్బంది ఉన్నా లక్ష్యాలను సాధిస్తాం. కౌలు రైతులకు ఈ ఏడాది మరింత రుణాలు ఇవ్వాలని కోరాం. రాష్ట్ర అభివృద్ధికి చేపట్టే పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని సీఎం కోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల విషయంలో రుణాలకు ప్రధాన్యం ఇవ్వాలని సూచించారని మంత్రి వెల్లడించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:State Annual Debt Plan Release

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *