బడుగు బలహీనర్గాలకు అభ్యున్నతికే రాష్ట్ర కుల గణన ప్రాంతీయ అవగాహనా సదస్సు -2023 :

-జిల్లా కలెక్టర్
సమ సమాజ స్థాపనకు కుల గణన తప్పనిసరి చిత్తూరు ఎం. పి. రెడ్డెప్ప
తప్పనిసరి కుల గణన అని సర్వే సంస్థలు చెబుతున్నాయి
మేయర్ డా. శిరీష

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

9 దశాబ్దాల కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కుల గణన చేపట్టడం పేదవారి అభ్యున్నతికి దోహదం చేస్తుందని ప్రాంతీయ సదస్సుకు అధ్యక్షత వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న  కుల గణన -2023  ఆవశ్యకత పై తిరుపతి, యస్.పి.యస్.ఆర్.  నెల్లూరు, చిత్తూరు, వై.యస్.ఆర్.  కడప మరియు అన్నమయ్య జిల్లా ల ప్రాంతీయ సదస్సును మంగళవారం  శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో  నిర్వహించగా ప్రజాప్రతినిధులు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తొమ్మిది దశాబ్దాలుగా కుల గణన జరగలేదని, మనదేశంలో 1872 లో తొలిసారిగా జన గణన ప్రారంభమైంది. 1931లో కుల గణన తో కూడిన జన గణన జరిగింది. తరువాత కాలంలో ఎస్సీ,  ఎస్టీ కులాల మినహా మిగిలిన వారిని జనరల్ కేటగిరీ కింద లెక్కిస్తూ వస్తున్నారని అన్నారు. ఆ తరువాత చేపట్టిన జనాభా గణనలో గత గణన లు ఆధారంగా పరిశీలనలోకి తీసుకొని వంద శాతం మేరకు పెరుగుతూ వచ్చేదని అన్నారు. అలాకాకుండా శాస్త్రీయంగా వాస్తవంగా ఉన్న కులాల వారి జనాభాను గుర్తించడానికి మన ప్రభుత్వం కుల గణన కు శ్రీకారం చుట్టిందని అన్నారు.  1931లో మన దేశ జనాభా 30 కోట్లు కాగా నేడు 140 కోట్లుగా ఉంది. కులాల వారి జనాభా లెక్కించడం వలన ప్రస్తుత కులాల వారిగా వారి యొక్క సామాజిక, విద్య, ఆర్థిక పురోగతి తెలుసుకోవడం వారికోసం సముచిత విధాన నిర్ణయాలు చేపట్టడానికి,  ప్రభుత్వ పథకాలు రూపకల్పనకు

 

 

ఉపయోగపడనున్నది. సదస్సుకు హాజరైన ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు ప్రజలు తమ సందేశాలను ఇవ్వాలని రాతపూర్వకంగా ఇచ్చిన వినతులను కూడా పరిగణంలోకి తీసుకొని నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నామని వివరించారు.ఆంధ్ర రాష్ట్ర శాసనసభ 2021లో సాధారణ జనాభా గణన 2021తోపాటు కులగణన చేపట్టాలని తీర్మానం ఆమోదించిందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపడం జరిగిందని గుర్తుచేశారు.
చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంతరాలు తొలగాలని నిర్ణయించిన మేరకు నేడు నేను ఈ పదవిని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో చేపట్టానని అన్నారు. బడుగు బలహీన వర్గాలలో ఉన్న అంతరాలు తొలగిపోవాలి నేడు ఈ కుల గణన చేపట్టడం సమ సమాజ స్థాపనకు దోహదపడుతుందని సహకరించాలని అన్నారు.

 

 

రాష్ట్ర శాసనమండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవం కల్పించిన వ్యక్తిని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వము చేపట్టని విధంగా రాష్ట్రంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాజకీయ ఆర్థిక సమానత్వం కల్పించారని అన్నారు. కుల గణన వల్ల ప్రయోజనం ఉంటుందని మన ప్రక్క రాష్ట్రం తమిళనాడులో 1980లో జరిపారని అప్పటి లెక్కల ప్రకారం బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతం ఆ రాష్ట్రం పెంచిందని,  దీనివల్ల సమానత్వం సాధించగలుగుతామని అన్నారు.
తిరుపతి నగర మేయర్ శిరీష మాట్లాడుతూ సమాజంలో అంతరాలు తొలగాలంటే తప్పనిసరి కుల గణన అవసరమని ఎన్నో సర్వే సంస్థలు చెబుతున్నాయని అన్నారు. కుల గణన ఖచ్చితమైన డేటా ఉంటేనే ఆర్థికంగా రాజకీయంగా రాబోవు తరాలకు ఉపయోగపడుతుందని అన్నారు.

 

 

చిత్తూరు నగర మేయర్ అముద మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అందువల్లే ఎంతో మంది బడుగు బలహీన వర్గాల మహిళలకు పెద్ద పీట వేసి పదవులు కట్టబెట్టారని అందులో నేను ఒకరిని మా కులాల వారు నాకు కట్టబెట్టిన ఈ పదవికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారని అన్నారు.కుల గణన అనివార్యమని , శాస్త్రీయ గణాంకాలు అవసరమని సమ సమాజానికి ఉపయోగమని తప్పనిసరి చేపట్టాలని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సర్వే అధికారులకు మంచి శిక్షణ వుండాలని సూచించారు.ఈ సదస్సులో వివిధ జిల్లాల నుండి కార్పొరేషన్ల చైర్మన్లు,  డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు లక్ష్మయ్య, పుల్లయ్య, సురేంద్రనాథ్ , కుమార్ రాజా , శాంతి , బాబు , ముస్లిం పెద్దలు,  శ్రీరాములు, వేమ నారాయణ , తమ అభిప్రాయాలను, కులాల జీవన విధానం వేదికపై తెలియజేశారు.

 

Tags: State Caste Enumeration Regional Awareness Conference -2023 for the upliftment of the underprivileged:

Post Midle