Natyam ad

మహిళలు బాగుంటే రాష్ట్రం అభివృద్ధి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మన ఇంటిలో మహిళలు సంతోషంగా ఉంటే ఆఇల్లు , ఆగ్రామం , ఆరాష్ట్రం అభివృద్ధి చెందుంతుందనే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మహిళా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. బుధవారం పుంగనూరులో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , జేసి డాక్టర్‌ వెంకటేశ్వర్లు హాజరైయ్యారు. ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటి సభ్యులు సంక్షేమ పథకాలను స్వాహా చేశారన్నారు. మహిళలకు అందాల్సిన పథకాలను అందించకుండ మోసగించారన్నారు. చంద్రబాబునాయుడు సొంత తమ్ముడిని ఆచూకిలేకుండ దాచిపెట్టారని ఆరోపించారు. మాట్లాడేది కూడ చేతకాని లోకేష్‌ ప్రతిరోజు ముఖ్యమంత్రిని విమర్శిస్తూ పాదయాత్ర చేస్తున్నాడని ఎద్దెవా చేశారు. రాష్ట్రంలోని ప్రజల కష్టాలను గుర్తించేందుకు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి స్వయంగా చూసి సమస్యలను గుర్తించారని తెలిపారు. మహిళలను అభివృద్ధి చేసి ఆర్థికంగా పురుషులతో సమానంగా నిలుచుకునేలా వారికి అండగా నిలిచారన్నారు. అన్ని రంగాల్లోను 50శాతం పైగా రిజర్వేషన్లు కల్పించి, పదవులు, ఉద్యోగాలు ఇచ్చారని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చిరకాలం ముఖ్యమంత్రిగా కొనసాగేలా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; State development if women are good – MLA Dwarkanatha Reddy

Post Midle