రాష్ట్ర అభివృద్దే జగనన్న లక్ష్యం-ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ..

బద్వేలు ముచ్చట్లు:
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా జగనన్న పాలన సాగుతోందని ప్రజా సంక్షేమమే పరమావధిగా, రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా,రాజన్నరాజ్యమే  లక్ష్యంగా,ప్రజాస్వామ్య పరిరక్షనే పార్టీ సిద్ధాంతంగా, జన హృదయాలను గెలుచుకు ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 12 ఏళ్లు అయిందని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ అన్నారు. శనివారం బద్వేల్ మున్సిపాలిటీ లోని ఎన్. జి. వో కాలనీ లో గల దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాలలు వేసి  నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన లో ఎంతో సుభిక్షంగా ఉందని, బడుగు బలహీన వర్గాల ప్రజలు లు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన జనరంజకమైన పథకాలను అందుకొని సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరే ఉందని పేర్కొన్నారు. కులం మతం పార్టీలు చూడకుండ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేసి ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో అడచైర్మన్ సింగ సాని గురు మోహన్, మున్సిపల్ చైర్మన్ వా కమళ్ళ రాజగోపాల్ రెడ్డి, సగర్ కార్పొరేషన్ చైర్పర్సన్ గానుగపెంట రమణమ్మ సీనయ్య, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బద్వేల్ నియోజకవర్గం అధికార ప్రతినిధి సింగమల వెంకటేశ్వర్లు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ లు ఎర్రగొల్ల గోపాల స్వామి, రాచపూడి వెంకట సాయి కృష్ణ, కౌన్సిలర్లు,అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 
Tags:State Development Jagannath Goal-MLA Dr. Dasari Sudha

Leave A Reply

Your email address will not be published.