రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

భార‌త రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 29వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. జూన్ 30 నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ జులై 2. ఇక రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు జులై 18న పోలింగ్ నిర్వ‌హించి, 21న ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. కొత్త రాష్ట్ర‌ప‌తి జులై 25న ప్ర‌మాణ‌స్వీకారం చేసే అవ‌కాశం ఉన్న‌ది. ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీకాలం జులై 24న ముగియ‌నుంది.

 

Tags: State Election .. Gazette Notification Released