కొత్తగూడెంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు :

కొత్తగూడెం మున్సిపల్ ప్రగతి మైదాన్ లో  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాజరైనారు.ముందుగా ప్రగతి మైదానంలోని అమర వీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం  జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారులను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏడు వసంతాలు పూర్తి చేసుకుందని అన్నారు.  సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్,ఎస్పీ సునీల్ దత్,జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు,హరిప్రియా తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: State Emergence Day celebrations at Kottagudem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *