కరోనా నియంత్రణలో ఘోరంగావిఫలమైన రాష్ట్ర ప్రభుత్వం -పోకల ఈశ్వర్ యాదవ్,

తిరుపతి  ముచ్చట్లు :

 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు   సోమువీర్రాజు   , ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్రా వెంకట శివ నారాయణ యొక్క ఆదేశాలు మేరకు.బిజెపిఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోకల ఈశ్వర్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలోని కొర్లగుంట లో ఉన్న ఈశ్వర్ యాదవ్ ఇంటి దగ్గర  ఉదయం 10.00 గంటల నుంచి 12.00 గంటల వరకు నిరసన కార్యక్రమము జరిగినది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర వైసీపీ సర్కారు పటిష్ట చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ప్లే కార్డులుతో నిరసనలు చేయడం జరిగినది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈశ్వర్ యాదవ్ మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కువగా ఉన్నాయనిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోగులను కాపాడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తగా చేతులెత్తేసింది. ప్రభుత్వం కరోనా కట్టడిపై చెప్పే మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చర్యలు మాత్రం చేతులు దాటడం లేదు.

 

 

 

కోవిడ్ తో అమాయక పేద ప్రజలు చనిపోతున్నారని, అందుకు ఆవేదన కలుగుతుంది అని. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలల్లో బెడ్లు దొరక్క, ప్రైవేట్ ఆసుపత్రిలలో లక్షల్లో డబ్బులు చెల్లించ లేక, అరకొర ఆక్సీజెన్ తో పేద ప్రజలు పిట్టలాగా రాలిపోతున్నారుని, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీలు అరికట్టేందుకు రాష్ట్ర వైసీపీ. సర్కారు పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే అత్యధిక వైద్యశాలలు అధికారపార్టీ వారివి మరియు వారి సానుభూతి పారులవి. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ అంటూ మాటలు తూటాల్లా పేల్చడంలో అధికార వైసీపీ వాళ్ళు గొప్పలూ చెప్పండం తప్పా ఎక్కడ కూడా ఆచరణలో కనబడకపోవడంతో పేదవారు ఆవేదన చెందుతున్నారు.రాష్ట్రంలో 514 ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ కోసం బెడ్లు కేటాయించినట్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు.
కనీసం 10 శాతం బెడ్లు కూడా కేటాయించలేదు.

 

 

 

ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు దొరక్కుండా, ప్రైవేటు ఆసుపత్రిలో పేద రోగులను చేర్చుకోక, రోగులు అల్లాడుతుంటే సీఎం గారు ఒక్క ఆసుపత్రిని అయినా సందర్శించారా ? అని అడుగుతున్నాను.
. ఏ ఒక్క ప్రైవేటు ఆసుపత్రిలోనైనా 50 శాతం రోగులను చేర్చుకున్నట్లు నిరూపించగలరా? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఆక్సీజెన్ కొరత కారణంగా తిరుపతి రుయా ఆసుపత్రిలో పేదవాళ్ళు చనిపోతే, తక్కువ మందిని రికార్డ్ లో చూపించి , తూతుమంత్రంగా వ్యహరిస్తారా? , దోపిడీ చేసుకోవడానికే ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుందే తప్పా కరోనా ఉన్న పేద రోగులకు ఉపయోగపడటం లేదు. ఈ విపత్తరమైన సమయంలో ప్రైవేటు ఆసుపత్రులపై ఎందుకు చర్యలు తీసుకోని దోపిడీ వ్యవస్థను అరికట్టడం లేదని ప్రశ్నిస్తున్నాను.

 

 

 

దీనిపై ఎందుకు సీఎం గారు మాట్లాడటంలేదు? కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజావ్యతిరేక విధానాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యములను, విధివిధానాలను ప్రశ్నించినా, ఎదిరించినా, సలహాలు – సూచనలు చేసిన వారిని వెంటనే అక్రమంగా అరెస్టులు చేసి కేసులు నమోదు చేసి హించలకు గురిచేసి, సంక్షేమ పథకాలు రద్దుచేయడమే కాకుండా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని.అందుకే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ అదేశాలుతో ఈ రోజు నిరసనలు తెలియజేస్తూన్నాము.

 

 

ఎస్సీమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం మరియు ప్రైవేటు ఆసుపత్రులపైనా పర్యవేక్షణ లోపం, రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంక్షేమం పైన వైసీపీ ప్రభుత్వానికి తపన లేని కారణంగా మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను భేఖాతరు చేయడం, నిధులను పక్కదారి మళ్లించడం, కోవిడ్ పైనా సమీక్షలు నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవడం లేని కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా తీవ్రంగా విజృంభించుచున్నది.

 

 

కావున అఖిలపక్ష సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా సలహాలు, సూచనలు తీసుకుని కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ యాదవ్, ఎస్ సి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునిసుబ్రహ్మణ్యం, ఈఎస్ఐ బోర్డ్ మెంబర్ ర్ నేషనల్ మోహన్, సోషల్ మీడియా ఇంచార్జ్ నవీన్, జీవకోన మండల అధ్యక్షులు శరత్, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజశేఖర్, తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: State government fails miserably in corona control – Pokala Ishwar Yadav,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *