State Level Award for Poonganur in Election Management

ఎన్నికల నిర్వహణలో పుంగనూరుకు రాష్ట్ర స్థాయి అవార్డు

– 25న అవార్డులు ప్రధానం

Date:24/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర అసెంబ్లి, పార్లమెంట్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు పుంగనూరు ఆర్‌వో ఉత్తమ సేవలు అందించారని కమీషన్‌ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం పుంగనూరు తహశీల్ధార్‌ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. రాష్ట్రంలో 26 మందిని ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు ఎంపిక చేశారు. వీరిలో చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు ఎంపికైంది. విజయవాడలో శనివారం చీఫ్‌ ఎలక్ట్రోల్‌ ఆఫీసర్‌ కె.విజయనంద్‌ అవార్డును అందజేయనున్నారు. గత ఏడాది ఎన్నికల సమయంలో ఈఆర్‌వో ప్రస్తుతం రాయచోటి తహశీల్ధార్‌ ఎంవి.సుబ్రమణ్యంరెడ్డి ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా తహశీల్ధార్‌ వెంకట్రాయులు, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

పౌరసత్వ సవరణ చట్టం సర్వేలకు సహకరించేది లేదు

Tags: State Level Award for Poonganur in Election Management

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *