Natyam ad

పాలిటెక్నిక్ కళాశాల కు భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సదుం  ముచ్చట్లు;

పశు సంవర్థక పాలిటెక్నిక్ కళాశాల కు భూమి పూజ చేసిన రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖామంత్రి.రూ.10 లక్షల 62 వేల తో గార్గేయ నదిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జి వద్ద ఫ్లైఓవర్ విద్యుదీకరణ మంత్రి ప్రారంభోత్సవం.గురువారం సదుం మండలం వైయస్సార్ కాలనీ నందు రూ.800 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భగనుల శాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి….జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్.అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, హాస్టల్ బ్లాక్ బాలురకు బాలికలకు విడివిడిగా నిర్మించనున్న పాలిటెక్నిక్ కళాశాల నందు రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సునునిర్వహించనున్నారు.రాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి నుండి సదుం మండలం మారుతి వారి పల్లి కి చెందిన చిన్న పాపకు రూ.1.50లక్షలు, తిమ్మనాయుని పల్లికి చెందిన అమరావతమ్మ కు రూ.1.70 లక్షలు, జంగంపల్లి కి చెందిన నాగరాజుకు రూ. 38,000/- బయ్యా రెడ్డి గారి పల్లికి చెందిన చలపతికి 35,000/- నాకు సంబంధించిన చెక్కులను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు

Post Midle

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్.రెడ్డప్ప, తంబల్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారనాథరెడ్డి, టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్,తిరుపతి పశు విజ్ఞాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ వి.పద్మ నాభ రెడ్డి, రిజిస్ట్రార్ ఎ. రవి,డీన్ కె.బ్రహ్మయ్య,ఎస్టేట్ ఆఫీసర్ నగేష్.. ఎన్ ఆర్ ఈ జి ఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విశ్వనాధ్,జడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి,డ్వామా పిడి గంగాభవాని,డీపీఓ లక్ష్మి, ఎంపీడీఓ వరప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ కుమార్,జడ్పిటిసి సోమశేఖర్ రెడ్డి, ఎంపీపీ ఎల్లప్ప,పులిచెర్ల ఎం పిపి సురేంద్ర రెడ్డి,సదుం సింగిల్ విండో చైర్మన్ తిమ్మా రెడ్డి,సర్పంచ్ ఉషారాణి, ఎంపీటిసి ఆనంద్,వైస్ ఎంపిపి ధనుంజయ రెడ్డి, నాయకులు పెద్దిరెడ్డి, ప్రకాష్ రెడ్డి,కృష్ణా రెడ్డి, సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

Tags:State Minister Dr. Peddireddy Ramachandra Reddy performed Bhumi Pooja for Polytechnic College

Post Midle