Natyam ad

శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి దంపతులు

చౌడేపల్లి  ముచ్చట్లు:

 

చౌడేపల్లి మండలం లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం  శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మ వారికి శరన్నవరాత్రుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ  మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దంపతులు.దేవి శరన్నవ రాత్రులు ఈ నెల 15 నుండి 23 వరకు అత్యంత వైభవంగా శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ  అమ్మ వారికి విశేష పూజల తో నవ రాత్రుల్లో భాగంగా 9 రోజులలో ప్రతి రోజు ఒక రూపం లో దర్శనము ఇస్తున్న అమ్మవారు.నేడు సరస్వతి దేవి రూపం లో భక్తులకు దర్శన మిచ్చి కోర్కెలు తీర్చుతున్న అమ్మవారు.అమ్మవారికి శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ  మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, స్వర్ణలత  దంపతులు .వీరితో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్.రెడ్డప్ప,జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, తంబళ్లపల్లి శాసన సభ్యులు పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి, ఎం ఎల్ సి భరత్,శ్రీ బోయకొండ గంగమ్మ పాలక మండలి చైర్మన్ నాగరాజ రెడ్డి,జిల్లాదేవాదాయ శాఖ అధికారి ఏకాంబరం,జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, బోయ కొండ ఆలయ ఈఓ చంద్ర మౌళి, తదితరులు.మంత్రి వారి వెంట రాష్ట్ర జానపద కళలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగ భూషణం,పిఆర్ ఈఈచంద్ర శేఖర్, పి కె ఎం ఉడా చైర్మన్ వెంకట్ రెడ్డియాదవ్, తహశీల్దార్ మాధవ రాజు,ఎం పి డి ఓ సుధాకర్, చౌడేపల్లి  జడ్పీటీసీ దామోదర రాజు,నాయకులు పెద్దిరెడ్డి,కృష్ణ మూర్తి, పాలక మండలి సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..

 

Post Midle

అభివృద్ధి పనుల కు మంత్రి డా. పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి చే ప్రారంభోత్సవ వివరాలు

 

దేవస్థాన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు

 

➡️ పెద్ద భోగ మండపం:బోయ కొండ వద్ద భక్తులు సౌకర్యం కొరకు రూ.32 లక్షలతో మండపం నిర్మాణం.

✳️ రూ. 45 లక్షలతో భక్తులకు, అతిధులకుఆశీర్వచనం ఇచ్చుటకు చండీ హోమం నిర్వహించుటకు యాగశాలతో కూడిన ఆశీర్వాద మండపం

☸️ రూ.25 లక్షలతో  బోయ కొండ మొత్తం కవర్ అయ్యేలా 130 సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వాటికి కంట్రోలింగ్ రూమ్, పోలీస్ అవుట్ పోస్ట్ , దేవస్థానసెక్యూరిటీ గార్డ్ నిమిత్తం సెక్యూరిటీ భవనం నిర్మాణం

✳️ రూ.75 లక్షలతోవాహనాల పార్కింగ్ కు అనువు గా పార్కింగ్ టైల్స్  ఏర్పాటు

➡️ రూ.45 లక్షల తో జడ్పీ మరియు గ్రామ పంచాయతీ నిధుల తో ఆలయం వద్ద కు నూతన సిమెంటు రోడ్డు నిర్మాణం.

 

Tags:

Post Midle