సదుంలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి
సదుం ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం లో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.అనంతరం లబ్ధిదారులకు వ్యవసాయ సంబంధిత పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివీది లో చిరు వ్యాపారులు చేసుకునే వారికి సోలార్ లైట్లు పంపిణీ చేసిన మంత్రి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి …
సదుం మండలం లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏర్పాటు చేయడం చాలా ఉపయోగం ఉంటుంది.గతంలో పిలేరుకు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు పుంగనూరు కు వెళుతున్నాం.ఇకపై ఇక్కడే కార్యాలయం అందుబాటులో ఉంటుంది.ఇప్పటికే సబ్ స్టేషన్, ఆసుపత్రి, ఫైర్ స్టేషన్ ఇలా అన్ని తెచ్చాం.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో ఈ అభివృద్ధి సాధ్యమైంది.ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాఇప్పటికే ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మించాం త్వరలో ప్రతి ఇంటికి నీరు అందిస్తాం.మూడు రిజర్వాయర్లు నిర్మిస్తుంటే, చంద్రబాబు సుప్రీం కోర్టు వరకు వెళ్లి నిర్మాణాల పై స్టే తెచ్చారు.త్వరలో కోర్టులో పోరాడి, కోర్టు అనుమతితో ఆ మూడు రిజర్వాయర్ల పనులు ప్రారంభిస్తాం.గతంలో జన్మభూమి కమిటీల లాగా వివక్షతో పథకాలు అందించలేదు.పేదరికమే కొలమానంగా తీసుకుని కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందిస్తున్నాం.రాబోయే ఎన్నికల్లో సిఎం వైఎస్ జగన్ కు మనం మద్దతు ఇస్తే… రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందిఅందరూ సిఎం వైఎస్ జగన్ కు అండగా నిలవాలని కోరుతున్నా.
Tags: State Minister Peddireddy inaugurated the new sub-registrar’s office in Sadum
