రొంపిచర్ల మండ లం లో పల్లెబాట కార్యక్రమం ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి
రొంపిచర్ల ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండ లం లో పల్లెబాట కార్యక్రమం ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్, అటవీ,పర్యావరణభూగర్భ గనుల శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి.నేటి నుండి మూడు రోజులు పాటు సాగనన్న పర్యటన.మొత్తం 21 రోజుల్లో 777 గ్రామాల పర్యటించి, ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించిన మంత్రి.రాష్ట్రంలో పార దర్శకమైన పాలన కొనసాగుతుంది.పేదరికమే కొల మానం గా సంక్షేమ పథకాల లబ్ది. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ,భూగర్భ గనుల శాఖ మంత్రి రాష్ట్రంలో పారదర్శక మైన పాలన కొన సాగుతుందని గౌ. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు డా.పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం పుంగ నూరు నియోజక వర్గం రొంపిచర్ల మండలం లో పల్లెబాట కార్యక్రమం ను మంత్రి ప్రారంభించారు.

మొదటి రోజు మండలంలో మొత్తం 57 పల్లెలలో పర్య టించనున్న మంత్రి మొత్తం మూడు రోజులు పాటు పర్యటన జరగ నున్నది.ఇప్పటికే నియోజకవర్గం లోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, పులిచర్ల, రొంపిచర్ల మండలాల్లో పల్లెబాట కార్యక్రమం పూర్తి చేసిన మంత్రి, మొత్తం 22 రోజుల్లో 834 గ్రామాలు పర్యటించి, ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల హామీలను నెరవేర్చడం జరుగుతున్నదని,రాష్ట్రంలో పారదర్శకమైన పాలన కొనసాగుతుందని, ప్రతి పథకం ఇంటి ముగింట అందేలా చేసిన ఘనత ముఖ్య మంత్రి కే చెందుతుందని తెలిపారు.పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారనన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించేందుకు ఇప్పటికే ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నాం అని, త్వరలోనే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తామని వివరించారు. ప్రతి పొలానికి సాగు నీరు అందిచేందుకు కూడా చర్యలు చేపడుతునన్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రోడ్లు, భవనాలు పెద్దఎత్తున నిర్మించామని తెలిపారు. నియోజకవర్గం లో దాదాపు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని,పల్లెబాటలో సమయంలో ఎటువంటి సమస్యలు లేవని, తమకు లక్షల రూపాయల లబ్ది చేకూరుతుందని మహిళలు చెప్తుంటే సంతోషంగా ఉందన్నారు మంత్రి..
ఈ పల్లె బాట కార్య క్రమం లో జెడ్.పి ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథా రిటీ ఛైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, ఎంపీపీ పురుషోత్తం రెడ్డి,జెడ్పిటిసి రెడ్డిశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ విజయ శేఖర్ రెడ్డి,నూలు రెడ్డప్ప, సింగల్ విండో చైర్మన్ హరినాథ్ రెడ్డి, తహశీల్ధారు అమర్నాథ్,ఎంపీడీఓ దేవేంద్రనాథ్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: State Minister Peddireddy Rama Chandra Reddy started the village walk program in Rompicharla mandal
