Natyam ad

రొంపిచర్లమండలం పల్లెబాట కార్యక్రమంలో  రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రొంపిచెర్ల  ముచ్చట్లు:

రొంపిచర్లమండలం పల్లెబాట కార్యక్రమంలో  రాష్ట్ర విద్యుత్, అటవీ,పర్యావరణ,భూగర్భ గనుల శాఖ మంత్రి .పుంగనూరు నియోజకవర్గంలో విజయవంతంగా గా . . ఫలవంతంగా ముగిసిన పల్లెబాట కార్యక్రమం.నియోజకవర్గంలో మొత్తం 23 రోజులలో 885 పల్లెలలో సాగిన పల్లెబాట.పల్లెబాట కార్య క్రమంలో మంత్రికి జన నీరాజనం. పుంగనూరు నియోజకవర్గ ప్రజల తో మమేకమై వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారికి అడుగడుగునా భరోసా కల్పిస్తూ రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులు శాఖా మాత్యులు   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన పల్లెబాట కార్యక్రమం ఈ రోజు(ఆదివారం) తో విజయవంతంగా ముగిసింది.పుంగనూరు నియోజకవర్గంలో 23 రోజులు,885 పల్లెలలోనిర్వహించిన పల్లెబాట కార్యక్రమం విజయవంతంగా, ఫలవంతంగా సాగింది.ఈ సందర్భంగా మంత్రివర్యులకు నియోజకవర్గ ప్రజలు జన నీరాజనం పలికి ఆదరించారు.నియోజకవర్గ ప్రజల సమస్యలను మంత్రి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ ప్రజల్లో భరోసాను నింపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి  పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ముఖ్యమంత్రి  సహకారంతో మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని తెలిపారు. ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రారనభోత్సవాలు చేశారు.

Post Midle

చిప్పిలి వారి పల్లెలో ప్రారంభోత్సవాలు:

సచివాలయ భవనం – రూ.40 లక్షలు

ఆర్ బి కె భవనం – రూ. 21 లక్షలు

అంగన్వాడీ భవనం – రూ. 8.5 లక్షలు

గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించిన 160 నూతన గృహాలు – రూ.2.88కోట్లు

ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ ద్వారా ఎన్ ఆర్ డి డబ్ల్యూ పి స్కీం ద్వారా రక్షిత మంచి నీటి సరఫరా ఏర్పాటు – రూ.20 లక్షలు

సి సి రోడ్ – రూ.2.10 కోట్లు

ఆర్ ఓ ప్లాంట్ – రూ.5లక్షలు

పెద్దమల్లెలలో రూ.8.5 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ.5లక్షల తో ఆర్ ఓ ప్లాంట్, రొంపిచర్ల మండల కేంద్రంలో రూ.36 లక్షల విలువతో పునరుద్దరించబడిన ఎం పి డి ఓ భవనం, రావిళ్ళవారి పల్లె,చెంచం రెడ్డి గారి పల్లి లో ఒక్కొక్కటి రూ. 5లక్షలతో ఆర్ ఓ ప్లాంట్ లను మంత్రి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జెడ్ పి సీఈఓ ప్రభా కర్ రెడ్డి,ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, జెడ్పిటిసి రెడ్డీశ్వర్ రెడ్డి,వైస్ ఎంపీపీ విజయ శేఖర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ హరినాథ్ రెడ్డి, తహశీల్దార్ అమర్నాథ్, ఎంపీడీఓ దేవేంద్ర నాథ్,పిఆర్,ఆర్ డబ్ల్యూఎస్ డి ఈఈ లు మురళీధర్, రాజేంద్ర,నాయకులు పెద్దిరెడ్డి,జింకా చల పతి,కృష్ణమూర్తి ప్రజా ప్రతినిధులు అధికారులు,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Tags:State Minister Peddireddy Ramachandra Reddy in Rompicharlamandalam Pallebata program

Post Midle