సదుం మండలంలో మూడో రోజు పల్లెబాట కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సదుం ముచ్చట్లు :
సదుం మండలంలో మూడో రోజు పల్లెబాట కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.బుధవారం నాడు మండలం లోని పాలమంద, 79.ఏ. చింతమాకులపల్లి, చింతలవారిపల్లి, ఊటుపల్లి మండలంలోని 38 పల్లెలు పర్యటించిన మంత్రి.మండలంలో మూడు రోజుల్లో 112 పల్లెలు పర్యటించిన మంత్రి.ఇప్పటికే పుంగనూరు, చౌడేపల్లి, సొమల మండలాల్లో పూర్తయిన పల్లెబాట కార్యక్రమం.నియోజకవర్గం లో 16 రోజుల పాటు మొత్తం 573 పల్లెలు పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తూ సాగిన పల్లెబాట కార్యక్రమం.అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు.బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ తో పాటు ఆర్బికే, హెల్త్ క్లినిక్, అంగన్వాడి భవనాలు ప్రారంభించిన మంత్రి.పలు చోట్ల కొనసాగిన పార్టీలో చేరికలు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…
ప్రతి పేద కుటుంబం కు సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయంవారు వృద్ధిలోకి రావాలన్నదే సిఎం వైఎస్ జగన్ లక్ష్యం.గతంలో లాగా జన్మభూమి కమిటీలు లాంటి మధ్యవర్తిత్వం లేదు.నేరుగా అకౌంటుల్లోకి డబ్బులు జమ చేసి, పారదర్శకంగా పథకాలు అందిస్తున్నారు.నియోజకవర్గం ను మరింత అభివృద్ది చేస్తా.నిరంతరం మన శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న సిఎం వైఎస్ జగన్ కు అందరూ అండగా నిలవాలి.పుంగనూరు : నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది పథంలో నడిపేందుకు కృషి చేస్తానని తెలిపారు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బుధవారం నాడు సదుం మండలంలో మూడో రోజు పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. మండలం లోని పాలమంద, 79.ఏ. చింతమాకులపల్లి, చింతలవారిపల్లి, ఊటుపల్లి మండలంలోని 38 పల్లెలు పర్యటించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మండలంలో మూడు రోజుల్లో మొత్తం 112 పల్లెలు పర్యటించారు. ఇప్పటికే పుంగనూరు, చౌడేపల్లి, సొమల మండలాల్లో పల్లెబాట కార్యక్రమం పూర్తి చేసి నియోజకవర్గం లో 16 రోజుల పాటు మొత్తం 573 పల్లెలు పర్యటించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వెళ్ళిన ప్రతి పల్లెలో ప్రజలతో కాసేపు మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తూ పర్యటన కొనసాగించారు మంత్రి. మంత్రి పర్యటన నేపద్యంలో అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే నియోజకవర్గం లో రోడ్లు, సబ్ స్టేషన్లు సిద్దం చేశామని, మరోపక్క ఇప్పటికే ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం, ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు అందించే ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేసే దిశగా అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబం కు సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం మని, పేదవారు వృద్ధిలోకి రావాలన్నదే సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అని వివరించారు. అయితే గతంలో లాగా జన్మభూమి కమిటీలు లాంటి మధ్యవర్తిత్వం ఈ రోజు రాష్ట్రంలో లేదని, సచివాలయాల ద్వారా అర్హులను గుర్తించి, నేరుగా వారి అకౌంటుల్లోకి డబ్బులు జమ చేసి పారదర్శకంగా పథకాలు అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న సిఎం శ్రీ వైఎస్ జగన్ కు అందరూ అండగా నిలవాలని, వచ్చే ఎన్నికల్లో మునుపటికంటే ఇంకా గొప్ప విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
పల్లెబాట పర్యటనలో బాగంగా మండలంలోని చింతలవారిపల్లి పంచాయతీలోని బత్తలవారిపల్లిలో 17.67 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ భవనాన్ని ప్రారంభించారు. మహిళా డైరీ సహకారం అధ్వర్యంలో జగనన్న పాల వెల్లువ పథకానికి శ్రీకారం చుట్టారు మంత్రి. దానితో పాటుగా దాశిరెడ్డిగారిపల్లి లో ఆర్బికే, మిట్టపల్లిలో అంగన్వాడి, ఊటుపల్లిలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలు ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.మరోపక్క వైసిపిలోకి చేరికలు ప్రతి రోజు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం నాడు తుమ్మగుంటపల్లికి చెందిన 10 మంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, అందుతున్న సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరాం అని పేర్కొన్నారు.
Tags;State Minister Peddireddy Ramachandra Reddy who took up the village walk program on the third day in Sadum Mandal
